Corona Vaccine Representational image

దేశంలో వరుసగా రెండో రోజూ మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో 1,18,694 మందికి కొవిడ్‌ (Covid-19) నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,095 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. తాజా కేసులతో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,15,786) చేరింది.

మరోవైపు దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 15వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 15,208 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4.41 కోట్ల మంది (4,41,69,711) కోలుకున్నారు. కొత్తగా కేరళలో (Kerala) ముగ్గురు, గుజరాత్ (Gujarat)‌, గోవా (Goa)లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,867కి చేరింది.

ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..

ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases)0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,99,034) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.