One Rupee Coin (Photo Credits: PTI)

Jaipur, June 21: భార్యభార్తలు విడాకుల కేసులో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను భర్త రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో (Jaipur Man hands over to court 280kg of coins) తీసుకువచ్చాడు. దీంతో కోర్టు అతనికి షాకిస్తూ..ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి భార్యకు ఇవ్వాలంటూ ఆదేశించింది.

కేసు వివరాల్లోకెళితే.. హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్, భార్య సీమ గొడవలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్‌లో ఉండగా అది తేలే వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు.

ప్రధాని పేరు తెలియదన్న వరుడు, పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అతని తమ్ముడిని పెళ్లాడిన వధువు, యూపీలో విచిత్రకర ఘటన

దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్‌ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్‌ 17న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్‌ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.దీంతో దశరథ్‌ అరెస్ట్‌ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. ఆ సంచులు 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి.

బౌల్డ్ అయ్యాడని బౌలర్ గొంతు కోసి చంపిన బ్యాటర్, కాన్పూర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన

తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారంటూ ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్‌ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్‌ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్‌లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు.