మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో పాత కక్షలతో ఓ కుటుంబానికి చెందిన వారు తుపాకులతో వెళ్లి మరో కుటుంబంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. లేప గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తుపాకులతో ముఠాగా వెళ్లిన కొందరు.. బాధిత కుటుంబంపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
2013లో చెత్త పడేసే విషయంపై ధీర్ సింగ్ థోమర్, గజేంద్ర సింగ్ థోమర్ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ధీర్ సింగ్ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత గజేంద్ర కుటుంబం ఊరు విడిచి పారిపోయింది.అయితే ఇరు కుటుంబాలు ఇటీవలే కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి.
Heres' Video
Land vs Life: Six killed in Madhya Pradesh's Morena
| #Morena #MadhyaPradesh | pic.twitter.com/43ii3NNbLD
— Neha Singh (@SinNeha19) May 5, 2023
దీంతో గజేంద్ర సింగ్ థోమర్ ఫ్యామిలీ 10 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. వీరు ఇంటికి వచ్చిన కాసేపటికే పగతో రగిలిపోతున్న ధీర్ సింగ్ కుటుంబం దాడి చేసింది. మొదట కర్రలతో గజేంద్ర కుటంబసభ్యులను వీరు చితకబాదారు. ఆ తర్వాత తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.