Vagir Submarine: శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్​ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..
Vagir Submarine (Photo-ANI)

New Delhi, Jan 23: దేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ జనవరి 26వ తేదీన భారత ఢిఫెన్స్ లోకి ప్రవేశించనుంది. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన (fifth Submarine of Project 75 Kalvari class) సబ్‌మెరైన్ వాగీర్ (Vagir Submarine) త్వరలో ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో Adm R హరి కుమార్ CNS సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఐదో కల్వరీ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగిర్ అనేది బలీయమైన ఆయుధ ప్యాకేజీతో కూడిన సబ్‌మెరైన్. 24 నెలల వ్యవధిలో నౌకాదళంలోకి ప్రవేశించిన 3వ జలాంతర్గామి వాగిర్.

సంక్లిష్టమైన & సంక్లిష్టమైన ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడంలో మా షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది ఒక ప్రకాశవంతమైన సాక్ష్యమని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ (Adm R Hari Kumar) తెలిపారు. ఈ జలాంతర్గామి రాకతో ఇండియన్‌ నేవీ బలం పెరగనున్నదని నేవీ అధికారులు తెలిపారు. ఐఎన్‌ఎస్‌ వాగీర్‌తో చైనా నుంచి సముద్రంలో ఎదురయ్యే ముప్పునకు చెక్ పెట్టొచ్చని నౌకాదళాధికారి దల్జీందర్‌ సింగ్‌ తెలిపారు.

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విక్రమ్‌-ఎస్‌, దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ని ప్రయోగించిన ఇస్రో, మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతమైందని ప్రకటన

దీన్ని ముంబయిలోని మజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఇండియన్ నేవీ ప్రాజెక్ట్- 75 కింద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.ఫ్రాన్స్ దేశానికి చెందిన నావల్ గ్రూప్ సహకారంతో దీన్ని నిర్మించగా.. ఈ జలాంతర్గాముల ఉత్పత్తికి సంబంధించి ఇండియా-- ఫ్రాన్స్ మధ్య 2005లోనే ఒప్పందం కుదిరింది. నవంబర్ 12, 2020న వాగిర్ నిర్మాణం ప్రారంభం కాగా, గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆయుధ ప్రయోగాలు, సెన్సర్ ప్రయోగాలు వంటివి కూడా పూర్తయ్యాయి. కేంద్రం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా ఈ జలాంతర్గామని దేశీయంగానే తయారు చేశారు. ఈ సబ్ మెరైన్ మన నావికా దళాన్ని (Indian Navy) మరింత బలపేతం చేస్తుంది.

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి అగ్ని 3, ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమయిందని తెలిపిన రక్షణ మంత్రిత్వ శాఖ

భారత్ కు పెనుముప్పుగా మారిన చైనాకు పోటీగా.. తన సైనిక సామర్థాన్ని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించింది. అందులో భాగంగా దేశీయంగా జలాంతర్గాములను తయారు చేస్తూ.. జల మార్గంలో కూడా చైనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో పాటు ఇండియన్ నేవీ ప్రాజెక్ట్-75లో భాగంగా ఫ్రెంచ్ కంపెనీ DCNS రూపొందించిన ఆరు కల్వరి-తరగతి జలాంతర్గాములను కూడా దేశంలో నిర్మిస్తున్నారు. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైనింగ్ లేయింగ్, ఏరియా సర్వైలెన్స్ వంటి మిషన్‌లను కూడా రూపొందించనుంది.

వాగిర్ 2022 ఫిబ్రవరి నుంచి సముద్ర ట్రయల్స్‌ ప్రారంభించింది. ఇతర జలాంతర్గాములతో పోలిస్తే అతి తక్కువ సమయంలో ఆయుధాలు, సెన్సార్ల ప్రధాన ట్రయల్స్‌ను పూర్తి చేసుకోవడం విశేషం.భారత నౌకాదళానికి 25 జలాంతర్గాములను అందించాలని ఇంద్రకుమార్ గుజ్రాల్ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రాజెక్ట్ 75 ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కింద సబ్‌మెరైన్లను తయారుచేయడానికి 30 ఏండ్ల ప్రణాళిక రూపొందించారు. 2005 లో భారత్‌-ఫ్రాన్స్ మధ్య 6 స్కార్పెన్-డిజైన్ జలాంతర్గాములను ఉత్పత్తి చేయడానికి 3.75 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. కల్వరి తరగతికి చెందిన తొలి సబ్‌మెరైన్‌ను 2017లో ఇండియన్‌ నేవీ అందుకున్నది.

అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల ఈ జలాంతర్గామి శత్రు సబ్‌మెరైన్‌లు, యుద్ధనౌకలను సులువుగా ఏమార్చగలవు. ఇందులో ఉండే అధునాతన సోనార్‌, రాడార్‌ వ్యవస్థలు ప్రత్యర్థి నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిశితంగా గమనించగలవు. యుద్ధం వస్తే శత్రువును నిలువరించేందుకు లేదా ఎదురుదాడికి దిగేందుకు అత్యాధునిక మైన్‌లు, టార్పిడోలను ఇందులో పొందుపరిచారు. దీన్ని తీరానికి దగ్గరగా లేదా నడిసముద్రంలోనూ మోహరించవచ్చని అధికారులు తెలిపారు.