Calcutta High Court (Photo Credit- Wikimedia Commons)

Calcutta High Court on Maintenance to First Wife: వ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది భర్త మొదటి భార్యకు నెలవారీ భరణాన్ని ₹6,000 నుండి ₹4,000కు తగ్గించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది.

సింగిల్ జడ్జి జస్టిస్ శంపా దత్ (పాల్) పిటిషనర్ మహిళ తన భర్తను అక్టోబర్ 12, 2003న వివాహం చేసుకున్నారని, వరకట్న డిమాండ్లు నెరవేరకపోవడంతో అక్టోబర్ 12, 2012న ఆమెను తన ఇంటి నుండి వెళ్లగొట్టారని ఆరోపించారు. ఆమె భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, ఆపై ఎక్కువ కట్నం కావాలంటూ పిటిషనర్ భార్యను వెళ్లగొట్టారని కోర్టు పేర్కొంది.

గోవధ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఈ అంశాన్ని శాసనసభ ద్వారా పరిష్కరించుకోవాలని తీర్పు

అక్టోబర్ 6, 2016 నాటి ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ ఫిబ్రవరి 27, 2019న సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను భార్య సవాలు చేసింది. కుటుంబ న్యాయస్థానం పిటిషనర్‌కు నెలవారీ భరణంగా ₹ 6,000 చెల్లించాలని ఆమె భర్తను ఆదేశించింది. అయితే, సెషన్స్ జడ్జి ఆ మొత్తాన్ని ₹4,000కి తగ్గించారు. దీంతో హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపింది.