File image of RBI Governor Shaktikanta Das | (Photo Credits: PTI)

New Delhi, April 17: కరోనా వైరస్ (Coronavirus) కారణంగా దేశంలో తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం,అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు,క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. దేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను RBI ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు (Coronavirus lockdown) పొడిగించిన తరువాత ఈ సమావేశం జరిగింది.

లాక్‌డౌన్ పొడగింపుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పిడుగు పాటు

ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) ప్రకటించారు. ప్రతీ అంశాన్ని, పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని, సంబంధిత చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే చివరి సమావేశం కాదని, ఈ ప్రక్రియ ఇకముందు కూడా కొనసాగుతుందని, కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశిలీస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధిగమించేందుకు ఆర్‌బీఐ అండగా వుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

 దేశంలో 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 437 కు పెరిగిన మరణాల సంఖ్య

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ అక్టోబర్ 1931,లండన్‌లో చెప్పిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు. 'మరణం మధ్యలో జీవితం కొనసాగుతుంది, అసత్య సత్యం మధ్యలో కొనసాగుతుంది, చీకటి మధ్యలో కాంతి కొనసాగుతుంది..' అన్న గాంధీ మాటలే స్పూర్తిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని, ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలు అయ్యాయని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనావేసింది. జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికంగా ఉందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని, జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇక బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉందని శక్తికాంత దాస్‌ వివరించారు.

ఈ సందర్భంగా 24 గంటలూ శ్రమిస్తూ విశేష సేవలందించిన ఆర్‌బీఐ (Reserve Bank of India) ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల సేవలు కూడా ప్రశంసనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగలేదు. ఏటీఎంలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 1930 తరువాత ఇంతటి సంక్షోభాన్ని చూడలేదనీ, అయినా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.

నాబార్డు , సిడ్బీ, ఎన్‌హెచ్‌బి వంటి ఆర్థిక సంస్థలకు రూ. 50 వేలకోట్ల ఆర్థిక సదుపాయాన్ని గవర్నర్ ప్రకటించారు. రివర్స్ రెపో రేటు 4 శాతం నుంచి పావుశాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రస్తుత 3.75 శాతంగా వుంటుంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నారు.

చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు గవర్నర్ తెలిపారు. అలాగే రాష్ట్రాలకు 60శాతం ఎక్కువ నిధులు, నాబార్డ్,సిడ్బీ,ఎన్‌హెచ్‌బీలకు రీఫైనాన్సింగ్ కోసం రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు. రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్స్ నుంచి 3.75శాతానికి తగ్గించినట్టు తెలిపారు.

ఏప్రిల్ 15 నాటికి ఆర్థిక వ్యవస్థలో వద్ద 6.91కోట్లు మిగులు ఉందని.. బ్యాంకులు దీన్ని ఉపయోగించుకునేందుకు రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించి 4 శాతం నుంచి 3.75శాతానికి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ద్రవ్య వినిమయ సర్దుబాటు కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆర్బీఐ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు బ్యాంకులు డివిడెంట్స్‌ను ప్రకటించవద్దని శక్తికాంత దాస్ తెలిపారు. తక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకుల లిక్విడిటీ కవరేజీని 100శాతం నుంచి 80శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు.

ఇది అక్టోబర్ 2020 నాటికి 90శాతం పునరుద్దరించబడుతుందని.. ఏప్రిల్ 2021 నాటికి 100 శాతం పునరుద్దరించబడుతుందని తెలిపారు.నాన్ పెర్ఫామింగ్ అసెట్స్ (NPA)వర్గీకరణకు సంబంధించి మారటోరియంను మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఎన్‌పీఏ రిసల్యూషన్ ప్లాన్ 90 రోజులకు పొడగిస్తున్నట్టు తెలిపారు.లక్ష్యంగా పెట్టుకున్న రూ.25వేల కోట్ల లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్‌కు నేడు వేలం జరుగుతుందన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందిన కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇదే తరహాలో మినహాయింపులు ఉంటాయన్నారు.