New Delhi, July 10: పెళ్లై విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు(Muslim women) ఊరట లభించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు (Muslim women) తమ భర్తల నుంచి భరణం (Maintenance) కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125 కింద మహిళందరికీ, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఈ హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది. ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భర్తల నుంచి భరణం కోరుతూ పిటిషన్‌లు వేయవచ్చునని కోర్టు పేర్కొంది.
జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో వేర్వేరుగా ఒకేవిధమైన తీర్పులను వెలువరించింది. ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం 1986 సెక్యులర్ చట్టాన్ని అతిక్రమించదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. తన నుంచి విడాకులు తీసుకున్న భార్య భరణం కోరుతూ పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ ఓ ముస్లిం భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. IPC సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
తన డైవోర్స్‌డ్ భార్య వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరాడు. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళకు భరణం కోరే హక్కు ఉన్నదని తెలిపింది. ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ ముస్లిం భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. ఒక భారతీయ వివాహిత మహిళ(indian women) ఆర్థికంగా స్వతంత్రంగా లేదన్న వాస్తవాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.
మా నిర్ణయంలో 2019 చట్టం ప్రకారం ‘చట్టవిరుద్ధమైన విడాకుల’ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. CrPC సెక్షన్ 125 ప్రకారం పెళ్లైన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ (లివ్-ఇన్ మహిళలతో సహా) వర్తిస్తుందని వెల్లడించింది. భరణం కోరే విషయంలో మతంతో సంబంధం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 125 CrPC కింద కేసు పెండింగ్‌లో ఉండి, ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె 2019 చట్టాన్ని ఆశ్రయించవచ్చని కోర్టు చెప్పింది.