Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, Jan 3: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు (SC Veridct on Free Speech) చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధించలేమని (Additional Restrictions Can’t Be Imposed) స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్‌ స్వాతంత్ర్యంపై ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (Supreme Court ) పేర్కొంది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని తెలిపింది.ఉత్తర్‌ప్రదేశ్‌లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సామూహిక అత్యాచార కేసుపై అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 4:1 మెజారిటీతో ఈ విధమైన తీర్పు వెలువరించింది.

ముఖేష్ అంబానీ కొడుకునంటూ మహిళతో ఛాటింగ్, నగ్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్, రూ. 25 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలు

పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగపరమైన హింసగా పరిగణించబడదు, కానీ అది ఒక ప్రభుత్వ అధికారిని తప్పించడం లేదా నేరం చేయడానికి దారితీస్తే అది రాజ్యాంగ హింస. ‘‘నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేం. పార్లమెంటు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలది. అందుకు ఒక ప్రవర్తన నియమావళి వారి రూపొందించుకోవాలి. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు.

నేతల విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉంది. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యం అని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రియుడు మోజులో మైనర్ కిరాతకం, ప్రేమకు అడ్డుగా ఉందని కన్నతల్లిని దారుణంగా పొడిచి చంపేసిన కూతురు, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన

అయితే ధర్మాసనంలో మెజారిటీ తీర్పుతో విభేదించారు జస్టిస్ నాగరత్న. నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని.. ఈ సమస్యకు పార్లమెంటు పరిష్కారం చూపాలని ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నేతలు చేసే విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని.. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని జస్టిస్‌ నాగరత్న స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ బులంద్‌షహర్‌ జిల్లాలో 2016 జులై నెలలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదయ్యింది. తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును ఢిల్లీకి బదిలీ చేయాలంటూ యూపీకి చెందిన వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేకాకుండా ఈ ఘటనను ‘రాజకీయ కుట్రగా’ పేర్కొంటూ అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజమ్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆపై కోర్టు, ఖాన్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.

తొలుత దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. 2017 అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. నవంబర్‌ 15న ఈ కేసు విచారణ పూర్తిచేసిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. తాజాగా తీర్పు వెలువరించింది.