Suicide Representative Image (Photo Credits: Unsplash)

Chennai, July 25: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత24 గంటల్లో బాలిక ఆత్మహత్య ఘటన మరచిపోకముందే తిరువళ్లూరులో మరో విద్యార్థిని సూసైడ్ (Class 12 Girl Commits Suicide) చేసుకుంది. కాగా తమిళనాడులోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటన జరిగి 24 గంట‌లు గ‌డువ‌క‌ముందే కడలూరు జిల్లాలో ఓ విద్యార్థిని బ‌ల‌వ‌ర్మ‌ణానికి పాల్ప‌డింది.

కేవ‌లం రెండు వారాల్లో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలు (Third Incident in Two Weeks) చేసుకున్నార. తాజాగా మృతి చెందిన విద్యార్థినిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తిరువ‌ళ్లూరులోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం ఆ సంస్థ హాస్టల్ ఆవరణలో శవమై కనిపించింది.

తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య, 10 రోజుల వ్యవధిలోనే రెండో ఘటన, తమ కూతురు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ తల్లిదండ్రులు ఆందోళన

ఆమె ఆత్మహత్య (ఉరి వేసుకుని) చేసుకున్న‌ట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. సత్య ప్రియ విలేకరులతో వెల్ల‌డించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్-సీఐడీ (సీబీసీఐడీ)కి బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు.

ఉపాధ్యాయులు టార్చర్ తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య, ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటన

ఈ నెల‌ 13 న కల్లకురిచి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు కోపంతో స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. ఇదిలా ఉంటే టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన తమిళనాడు ప్రభుత్వం ‘మనవర్ మనసు’ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది.