Chennai, July 18: తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య (Kallakurichi Student Death) చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ, మ్యాథమెటిక్స్ టీచర్ కృతికను అరెస్ట్ ( 2 teachers arrested) చేశారు. విద్యార్థిని మృతికి కారణం స్కూల్ యజమాన్యమే కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. అంతేగాక పలువురు గ్రామ ప్రజలు వందల సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థినికి న్యాయం చేయాలంటూ నిరసనలు చేశారు. పైగా వారంతా స్కూల్లోని ఫర్నీచర్‌ని ధ్వంసం చేయడమే కాకుండా పోలీసు వాహనాలను కూడా తగలు బెట్టారు.
ఆ విద్యార్థిని తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా చనిపోయిందని (Tamil Nadu student suicide case) పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసుకి సంబంధించి ప్రిన్సిపాల్, స్కూల్ మేనేజ్‌మెంట్ అధికారులతో సహా ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థి ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం స్టాలిన్ కూడా స్పందించి నిరసనలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ విద్యార్థిని మృతిపై సత్వరమే విచారణ జరిపించడమే కాకుండా నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Here's Violence videos
#WATCH Tamil Nadu | Violence broke out in Kallakurichi with protesters entering a school, setting buses ablaze, vandalizing school property as they sought justice over the death of a Class 12 girl pic.twitter.com/gntDjuC2Zx
— ANI (@ANI) July 17, 2022
DIG Sylendra Babu said necessary action will be taken based on what the investigation reveals. "We can't arrest the teachers without adequate evidence," he said.@TheQuint #Kallakurichi #TamilNadu pic.twitter.com/Qo6cJT7hSN
— Smitha T K (@smitha_tk) July 17, 2022
A class 12 student of a private higher secondary school died allegedly by suicide on 12 July night. The deceased left behind a note alleging she was being tortured by 2 teachers.
Relatives and locals gathered in large numbers accusing the school of the girl's death @TheQuint pic.twitter.com/LxkbvOThA2
— Smitha T K (@smitha_tk) July 17, 2022
12వ తరగతి ఆత్మహత్య
కళ్లకురిచ్చికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. హాస్టల్‌లోని మూడో అంతస్తులోగల ఓ గదిలో ఉంటున్న బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పై అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలై చనిపోయింది. బాలిక మృతికి ఆ స్కూల్ యాజమాన్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామానికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో స్కూల్ వద్దకు తరలివచ్చారు. విధ్వంసం సృష్టించారు. సదరు పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.