Chennai, July 18: తమిళనాడులోని కళ్లకూరిచిలో (Kallakurichi) తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై (Suicide)నిరసనలు చెలరేగాయి. ఆగ్రహంతో కాలేజీ బస్సులకు నిప్పు పెట్టారు నిరసనకారులు. అడ్డు వచ్చిన పోలీసులతో గొడవపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ (Laticharge) చేశారు. టీచ‌ర్ల‌ వేధింపులు తాళ‌లేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మృతురాలి త‌ల్లిదండ్రులు, బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్కూల్ కు వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. ఈ నిర‌స‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసి ఉన్న బ‌స్సుల‌ను త‌గుల‌బెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కళ్లకురిచి సమీపంలోని చిన్న సేలం(Selam) వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇద్దరు టీచర్లు(Teachers) తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్‌ లో రాసింది. జులై 13న స్కూల్‌ వాచ్‌మెన్‌ మైదానంలో విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించాడు. షాక్ కి గురైన అతడు.. వెంటనే స్కూల్‌ యాజమాన్యానికి విషయం చెప్పాడు. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్ప‌టికే మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

కాగా.. వేధింపుల వ‌ల్లే స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే ఆరోపణలను టీచర్లు ఖండించారు. టీచర్ల సమాధానంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు. కళ్లకూరిచి-సేలం రహదారిని దిగ్బంధించారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణకు నిరసనకారులు చేరుకున్నారు. టీచ‌ర్ల‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. కోపంతో స్కూల్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న బ‌స్సులు, ఇత‌ర ఆస్తులను తగులబెట్టారు. ప‌లు వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో పోలీసులు రంగలోకి దిగారు.

Monsoon Session: మరికాసేపట్లో సభాసమరం! వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం, ఈ సారి సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ నిర్ణయం, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా రెడీ 

దీనిపై పోలీసులు స్పందించారు. హింసకు పాల్పడొద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బాలిక గాయపడిందని పాఠశాల యాజమాన్యం మొదట తనకు సమాచారం అందించిందని మృత్తురాలి తల్లి తెలిపారు. తర్వాత చ‌నిపోయింద‌ని చెప్పార‌ని అన్నారు. రక్తస్రావం, గాయాల కారణంగా షాక్‌కు గురై బాలిక మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కాగా, అసలు గాయం ఎలా అయ్యింది? అనేది మిస్టరీగా మారింది. దీనిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం స్టాలిన్ స్పందించారు. శాంతిగా ఉండాలని ఆయన ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.