Vjy, August 6: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ సీఎంకు 980మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు.
టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ, దాడులు, అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. జగన్ బాధితులు.. పులివెందుల నుంచి ప్రజా దర్బార్‌కు వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ దాడులు ఆపకపోతే రేపు మా కార్యకర్తలు ఆగమన్నా ఆగరు, సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసిన వైఎస్ జగన్
భద్రతపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి సమాధానమిస్తూ.. 980 మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్యంత. ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన అడుగుతున్నారు. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు. అంత భద్రత ఎలా ఇస్తాం? భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేసుకోండి.. కానీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం తప్పు. పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగంపై మండిపడిన పేర్ని నాని
కోడికత్తి దాడి జరిగిందని ఐదేళ్ల తర్వాత జగన్‌కు గుర్తొచ్చిందా? సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఎన్నిసార్లు కోర్టు విచారణకు పిలిచినా.. ఏదో వంకతో హాజరు కాలేదు.. దీన్నిబట్టే ఆయనదంతా డ్రామా అని అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్‌కి తెలియదా?’’ అని నిలదీశారు.