YS Jagan Slams CM Chandrababu Naidu Over TDP Cadre Attacks on YSRCP Activists

Vjy, August 6: కేవలం ఆధిపత్యం చాటడం కోసమే పథకం ప్రకారం నవాబ్‌పేట్‌ దాడి ఘటన జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ (YS Jagan Slams CM Chandrababu)డి అన్నారు. దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో జగన్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నవాబ్‌పేటలో ప్లాన్‌ ప్రకారమే కర్రలతో కొట్టారు. సుమారు 20 మంది కలిసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు?. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు.  నూజివీడులో తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపపై దారుణం, పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం, ఘటనపై సీరియస్ అయిన మంత్రి కొలుసు పార్థసారథి

కానీ, ఇప్పుడు రాషష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా అదుపు తప్పింది. చివరకు.. మహిళలు, చిన్నారులపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా.. దాడులు ఆపాలి. ఇప్పటికైనా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి. గ్రామస్థాయి నుంచి భయానక పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ అరాచకాలను రాజకీయ పక్షాలకు వివరించాం. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తాం. హైకోర్టుకు.. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తామని అన్నారు.  పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంపై మండిపడిన పేర్ని నాని

ప్రజల్లో కొత్తగా ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కాస్తో కూస్తో టైం పడుతుంది. కానీ, చంద్రబాబు (CM Chandrababu Naidu) మీద వ్యతిరేకత చాలా వేగంగా పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలన మీద దృష్టి పెట్టడం లేదు. మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చడం లేదు. దాడుల్ని ప్రొత్సహిస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తానని మోసం చేశారు. పిల్లలను, అక్కాచెల్లెమ్మలను, తల్లులను.. ఇలా అందరినీ మోసం చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇవేవీ జాప్యం కాలేదని అన్నారు.

నంద్యాలలోనూ ఈ మధ్య రాజకీయ హత్య జరిగింది. ఈ శుక్రవారం అక్కడికి వెళ్తున్నా. ఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్‌ జగన్‌.