Tamil Nadu Shocker: అర్థరాత్రి ఏకాంతంగా ప్రియురాలితో ప్రియుడు, తల్లి రావడంతో ఒక్కసారిగా టెర్రస్ మీద నుంచి దూకిన ప్రియుడు, తలకు తీవ్ర గాయం కావడంతో మృతి

తమిళనాడులోని సేలం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో అర్థరాత్రి ప్రియుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలు తల్లి రావడంతో టెర్రస్ మీద నుంచి దూకేశాడు. ఆమె కంటపడకుండా ఉండేందుకు అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకడంతో తలకు తీవ్ర గాయమై మరణించాడు.

Tamil Nadu Shocker: అర్థరాత్రి ఏకాంతంగా ప్రియురాలితో ప్రియుడు, తల్లి రావడంతో ఒక్కసారిగా టెర్రస్ మీద నుంచి దూకిన ప్రియుడు, తలకు తీవ్ర గాయం కావడంతో మృతి
Representational Image (Photo Credits: Twitter)

Salem, Feb 6: తమిళనాడులోని సేలం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో అర్థరాత్రి ప్రియుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలు తల్లి రావడంతో టెర్రస్ మీద నుంచి దూకేశాడు. ఆమె కంటపడకుండా ఉండేందుకు అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకడంతో తలకు తీవ్ర గాయమై మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురిలోని కామరాజ్ నగర్‌కు చెందిన 18 ఏళ్ల సంజయ్, సేలంలోని సెంట్రల్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ మొదటి ఏడాది (Salem law college student) చదువుతున్నాడు. స్కూల్‌ నుంచి పరిచయం ఉన్న యువతి కూడా అదే కాలేజీలో లా చదువుతున్నది.

చదువు ఒత్తిడి భరించలేక పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య, స్ట్రెస్‌ తట్టుకోలేకపోతున్నా నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులకు లేఖ, మియాపూర్ లో విషాదకర ఘటన

క్లాస్‌మేట్స్ అయిన వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండే ఇంటి సమీపంలోనే బ్యాచిలర్స్‌తో కలిసి రూమ్‌లో అతడు ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి వేళ సంజయ్‌ తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వారిద్దరూ బాల్కానీ వద్ద మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆ యువతి తల్లి అక్కడకు వస్తుండటాన్ని సంజయ్‌ చూశాడు.

భార్యను చంపి రాత్రంతా పక్కన పడుకున్న భర్త, తెల్లారి శవాన్ని పూడ్చి ఆ సమాధిపై పంటను వేసిన కసాయి, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..

తమ విషయం ఆమెకు తెలియకుండా ఉండేందుకు (trying to escape from girlfriend’s mother) టెర్రస్‌ పైనుంచి కిందకు దూకాడు. అయితే నేలకు తల బాగా తగలడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Feb 06, 2023 09:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).