Lucknow, April 15: ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmed) ఎన్‌కౌంటర్‌లో (Encounter) చనిపోయాడు. వైద్యపరీక్షల కోసం ప్రయాగ్ రాజ్‌కు తీసుకెళ్తుండగా అతను పారిపోయేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో ఎన్ కౌంటర్ అయినట్లు తెలుస్తోంది. అతీక్ అహ్మద్ (Atiq Ahmed Encounter) తో పాటూ ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ కూడా ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు. అతిక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ. కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావటంతో.. ఆ కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో గుజరాత్ జైలుకు తరలించారు.
Uttar Pradesh | Visuals from Prayagraj where Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead. pic.twitter.com/vyzMk8GEir
— ANI (@ANI) April 15, 2023
మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్న అతిక్ అహ్మద్.. ఇటీవల కాలంలో.. అంటే రెండు నెలలుగా కోర్టు విచారణ కోసం ఉత్తరప్రదేశ్ వస్తూ ఉన్నారు. తరచూ వార్తల్లో ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితమే ఝాన్సీ వద్ద అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ (Asad Ahmad Encounter)తో పాటు మరొకరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
గతకొద్దికాలంగా అతిక్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. ప్రయాగ్ రాజ్ కోర్టుకు తీసుకెళ్తుండగా అతన్ని ఎన్‌కౌంటర్ చేస్తారన్న వార్తలతో మీడియా ఆయన్ను అనుసరించింది. అయితే తాజాగా వైద్యపరీక్షల కోసం వెళ్తుండగా ఎన్‌కౌంటర్ అవ్వడం సంచలనంగా మారింది.