New Delhi, August 26: భారత్- పాకిస్తాన్ (India Vs Pakisthan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన క్రేజ్. ఇరు వర్గాల అభిమానులు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణం. అయితే, ఆటగాళ్లుగా తమ మధ్య మైదానంలో మాత్రమే పోటీ ఉంటుందని.. ఒక్కసారి మ్యాచ్ ముగిశాక అంతా కలిసి అన్నదమ్ముల్లా (Like Brothers) మెలుగుతామని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంటున్నాడు.
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్, స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను విడుదల చేసిన ఐసీసీ
‘ఇండియా- పాకిస్తాన్ జట్లు మైదానంలోకి దిగాయంటే.. పోటీ తారస్థాయిలోనే ఉంటుంది. అయితే, ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్లగానే మేమంతా కలిసి సమయం గడుపుతాం. మా మధ్య అమితమైన ప్రేమ ఉంటుంది. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటాం’ అని వీరూ భాయ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ తాజా వ్యాఖ్యలు వైరల్ (Viral) గా మారాయి. క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.