Politics

YSRCP 4th List: వైసీపీ నాలుగో జాబితా విడుదల, మొత్తం 9 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

Hazarath Reddy

సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Delhi Excise Policy Case: వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా, ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని ఆరోపణలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా నాలుగోసారి గైర్హాజరయ్యారు.గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేజజ్రీవాల్‌ వెళ్లలేదు. ఈడీ నోటీసులపై ఆయన స్పందించారు.

PM Modi Address in AP: పాలసముద్రంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపిన ప్రధాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని పాలసముద్రంలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఐటీ చెల్లింపుల విధానాన్ని సరళతరం చేశామని తెలిపారు. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటీకేడు పెరుగుతుందని అన్నారు.

Uttar Pradesh: గోడ మీద కమలం గుర్తుకు రంగు వేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్: మెయిన్‌పురిలో లోక్‌సభ ఎన్నికల కోసం 'వాల్ రైటింగ్' కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్టీ 'కమలం' గుర్తుకు రంగులు వేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, ఏపీ పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ఆసక్తికర ట్వీట్

Hazarath Reddy

షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

Vivek Ramaswamy Out Of US President Race: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నుంచి భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అవుట్

Rudra

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి పోటీలో నుంచి నిష్క్రమించారు.

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.

Amit Shah: అమిత్ షా ఇంట్లో విషాదం.. ముంబై లో సోద‌రి రాజేశ్వ‌రి బెన్ షా క‌న్నుమూత‌

Rudra

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెల‌కొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వ‌రి బెన్ షా(60) క‌న్నుమూసింది.

Advertisement

Shiv Sena Row: సుప్రీంకోర్టుకు చేరిన శివసేన పంచాయితీ, ఏక్‌నాథ్ షిండే వర్గంపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఉద్ధవ్ సేన

Hazarath Reddy

ఏక్‌నాథ్ షిండేపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ సేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది.

Chandrababu Slams CM Jagan Ruling: ఈ స్థాయిలో అక్రమాలు నా 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేదు, సీఎం జగన్ పాలనపై మండిపడిన చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Gidugu Rudra Raju Resigns: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, వైఎస్ షర్మిల నియామకంపై లైన్ క్లియర్ అయినట్లేనా...

Hazarath Reddy

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు... రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు.

Advertisement

Lok Sabha Election 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం, పుట్టిన రోజు నాడు సంచలన ప్రకటన చేసిన మాయావతి

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని యూపీ మాజీ సీఎం, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే ఆప్షన్‌ తమవద్ద ఉందని చెప్పారు.

Ram Temple Inauguration: రాముడు అయోధ్యకు రానని నా కలలోకి వచ్చి చెప్పాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై Bihar minister Tej Pratap Yadav సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని వివరించారు

MP Balashauri Resign: ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా..టిక్కెట్ రాదనే మనస్తాపమే కారణం..జనసేన వైపు అడుగులు..

sajaya

మచిలిపట్నం వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సీట్ల మార్పుల కారణంగా టికెట్‌ రాని వారు నిరాశతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశానని, తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Andhra Pradesh Elections 2024: అనూహ్య మార్పులతో వైసీపీ మూడో జాబితా విడుదల, పెడన నుంచి పెనమలూరుకు మారిన జోగి రమేష్, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం

Hazarath Reddy

మొత్తం 175కు 175 సీట్ల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ పార్టీ తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో జాబితాలో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఇది ఆరంభమేనంటూ టీడీపీకి చురకలు అంటించిన కేశినేని నాని, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు విషెస్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh Elections 2024: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

Andhra Pradesh Elections 2024: తిరువూరులో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.

Adala Clarity on Party Change Rumors: పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ వార్తలపై ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement