Politics
Delicious Twist in Democracy: ఓటు వేసిన వారికి.. ఉచితంగా పోహా, జిలేబీ పంపిణీ.. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు మధ్యప్రదేశ్‌ స్వీట్‌ షాపు యజమాని చొరవ.. వీడియో వైరల్
Rudraఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్‌ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు.
Vijayashanti Joined Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపిన నటి
Hazarath Reddyబీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.
Telangana Assembly Elections 2023: నెలకు రూ. 4 వేలు ఫించన్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు.
Madhya Pradesh Polling: మధ్యప్రదేశ్‌ లో ప్రారంభమైన పోలింగ్‌.. 230 స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు.. ఛత్తీస్ గఢ్ తుది విడుత పోలింగ్ కూడా ఈరోజే
Rudraఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌ లో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh Politics: దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవండి, ఆ ముగ్గురికి సవాల్ విసిరిన మాజీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
Hazarath Reddyఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.
Mahadev Betting App Case: మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కాం కేసులో మరో మలుపు, డాబర్ గ్రూప్ అధినేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyమహాదేవ్ యాప్ బెట్టింగ్ కుంభకోణంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల తర్వాత పారిశ్రామికవేత్తల పేర్లు వినిపించాయి. డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ వి. బర్మన్, డైరెక్టర్ గౌరవ్ వి. బర్మన్ ముంబయి పోలీసుల విచారణలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే, తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనంటూ తుమ్మల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన. ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను. ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నానని తెలిపారు.
Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ
Rudraతెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Telangana Elections 2023: తెలంగాణలో గుర్తింపు లేని జనసేన పార్టీ, గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే గుర్తించిన ఎన్నికల కమిషన్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది. తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేదు
Telangana Election 2023: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15, ఈ సారి ఎంతమంది పోటీలో ఉన్నారంటే..
Hazarath Reddy2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. నవంబర్‌ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. ఇవాళ మధ్యాహ్నాం 3 గం.తో ముగిసింది. నేడు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, తుంగతుర్తి సీటులో అద్దంకి దయాకర్‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన దయాకర్
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చిన సంగతి విదితమే.తనకు సీటు ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తాను.
Telangana Elections 2023: నారాయణఖేడ్ నామినేషన్లలో అనూహ్య మలుపు, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి సంజీవరెడ్డి, పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్‌
Hazarath Reddyస్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు
Telangana Elections 2023: వీడియో ఇదిగో, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నా, సంచలన ప్రకటన చేసిన సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి
Hazarath Reddyనేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడానికే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సర్వేలు నేను గెలుస్తానని చెప్పినా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఆoతర్యమేంటి ?
Telangana Elections 2023: నీలం మధు,అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డిలకు షాక్, నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ఇదిగో
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది.
Telangana Elections 2023: కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్ మల్లన్న, పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీ నగర్‌కు వెళ్లగా.. క్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను మల్లన్న చూసుకుంటారు.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, సూర్యాపేట టికెట్ రాలేదని తెలిసి ఒక్కసారిగా ఏడ్చేసిన పటేల్‌ రమేశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నేతలు టికెట్‌ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్‌ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది
Telangana Assembly Election 2023: మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు, బీజేపీ తెలంగాణ అభ్యర్థుల చివరి జాబితా ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన చివరి జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది.
Parliament Winter Session 2023: డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు, మొత్తం 15 రోజుల పాటు ఉభయసభల సమావేశాలు
Hazarath Reddyపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2023 తేదీ వచ్చేసింది. డిసెంబర్‌ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. సెలవులు మినహా డిసెంబర్‌ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.
HC on PM Modi's Degree: అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ, ప్రధాని మోదీ డిగ్రీ వివరాల పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం, ఢిల్లీ సీఎంకు రూ. 25 వేలు జరిమానా
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత సర్టిఫికెట్లను తనకు అందించాలన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గురువారం కొట్టివేసింది.
Telangana Election 2023: వీడియో ఇదిగో, బుల్డోజర్లతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల పర్వం ముగియనుండటంతో నేతలంతా నామినేషన్లు వేయడానికి క్యూ కడుతున్నారు. ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నారు. తాజాగా పటాన్ చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వీడియో ఇదిగో..