Politics

YS Sharmila Padayatra: 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు

Hazarath Reddy

తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

PM Narendra Modi: దేశ విభజన విషాద సంస్మరణ దినం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్

Rudra

'దేశ విభజన సమయంలో ప్రాణత్యాగం చేసిన భారతీయులను భక్తిపూర్వకంగా స్మరించుకునే సందర్భం దేశ విభజన సంస్మరణ దినం. దీనితో పాటు, భారత్ ను వీడిన వారి బాధలను మరియు వారి పోరాటాన్ని కూడా ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. అలాంటి వారందరికీ నమస్కరిస్తున్నాను' అంటూ ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్ చేశారు.

PM Modi Degree Defamation Case: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు, అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, మీరు కోర్టుకు రావట్లేదని గుజరాత్ హైకోర్టు అసహనం

Hazarath Reddy

ప్రధాని మోదీ (PM Modi) డిగ్రీ అంశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం (defamation case) కలిగించాయని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసు గుజరాత్ హైకోర్టులో విచారణకు వచ్చింది.

Rahul Gandhi on PM Modi: భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ నేను ఉంటా, మణిపూర్‌లో మనుషులు చస్తుంటే ప్రధాని జోకులేసి నవ్వుతున్నారు,మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్‌ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండిపడ్డారు. హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని ప్రశ్నించారు.

Advertisement

Monsoon Session 2023: ఉభయ సభలు నిరవధిక వాయిదా, 22 బిల్లులకు లోక్ సభ ఆమోదం, అవిశ్వాస తీర్మానాన్ని రెండు సార్లు ఎదుర్కున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon session) భాగంగా ఉభయ సభలు (Loksabha) శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని స్పీకర్ ఓం బిర్లా వివరించారు.

Actress Jaya Prada: జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు, కార్మికులకు ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కేసు పెట్టిన కార్మిక బీమా కార్పోరేషన్‌

Hazarath Reddy

సీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది.దీంతో పాటుగా జరిమానా కూడా విధించింది

Amit Shah Introduces Three Bills: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు గుడ్ బై, IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలకు సంబంధించి లోక్‌సభలో 3 బిల్లులు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చే క్రమంలో కేంద్రం ముందడుగు వేసింది. 1860 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(భారత శిక్షా స్మృతి)తో పాటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(CRPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌(IEA) చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది.

Pawan Kalyan on Jagan: వీడియో ఇదిగో, తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణం, భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణమంటూ పవన్ కళ్యాణ్ తన యాత్ర సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఆంధ్ర ప్రదేశ్ లాగా తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ చేయరు. దీనిపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

Padala Aruna Joins Janasena: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్

Hazarath Reddy

విశాఖపట్నంలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి PawanKalyan ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. వీడియో ఇదిగో..

Bandi Sanjay on BRS Govt: కేసీఆర్ సర్కారు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు.

PM Modi on Manipur: మణిపూర్‌లో హింసకు కారణమైన దుర్మార్గులందరినీ శిక్షిస్తాం, మణిపూర్‌కు దేశం మొత్తం అండగా ఉంటుందని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

పార్లమెంటులో మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. తన ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత, అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. లోక్‌సభలో మణిపూర్‌పై ప్రధాని మోదీ ప్రస్తావించిన అనంతరం ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు .

No Confidence Motion Defeated: మూజువాణీ ఓటింగ్‌‌తో లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, అవిశ్వాసంపై సభలో మాట్లాడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.మూజువాణీ ఓటింగ్‌ నిర్వహించిన స్పీకర్‌.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలను ఎండగట్టారు.

Advertisement

PM Modi Speech in Lok Sabha: వచ్చే ఎన్నికల్లో మునుపటి రికార్డులు బద్దలు కొట్టుకుంటూ అధికారంలోకి వస్తాం, లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌, లోక్‌సభలో ప్రధాని మోదీ పూర్తి ప్రసంగం ఇదిగో..

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No confidence Motion) లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. గురువారం సాయంత్రం దీనిపై ప్రధానమంత్రి మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Telangana Elections 2023: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు, అజారుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య భగ్గుమన్న గొడవలు

Hazarath Reddy

జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో అజారుద్దీన్‌ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది

Modi is Most Popular PM: స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రజల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ, అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా

Hazarath Reddy

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 'స్వాతంత్ర్యం తర్వాత, ఎక్కువ మంది ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రభుత్వం

HM Amit Shah on Manipur Violence: మణిపూర్‌ హింసపై రాజకీయాలు సిగ్గుచేటు, ప్రతిపక్షాలపై మండిపడిన అమిత్ షా, శాంతి కోసం విజ్ఞప్తి చేసిన కేంద్ర హోం మంత్రి

Hazarath Reddy

మణిపూర్‌లో అశాంతిపై మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా బుధవారం, ఆగస్టు 9, బుధవారం లోక్‌సభలో ప్రసంగిస్తూ, ఈశాన్య రాష్ట్రంలో జరిగిన సంఘటనలు "సిగ్గుచేటు" అయితే, ఈ అంశంపై రాజకీయాలు ఆడటం మరింత సిగ్గుచేటని అన్నారు.

Advertisement

Rahul Gandhi Flying Kiss Row: స్మృతి ఇరానీకి ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని రాహుల్ గాంధీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు

Hazarath Reddy

రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్‌ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు.

No Confidence Motion: మీరు భారతదేశం కాదు, భారతదేశంలో అవినీతి లేదు, రాహుల్ గాంధీపై ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ

Hazarath Reddy

కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. దేశం రాజవంశాన్ని కాదు మెరిట్‌ను నమ్ముతుందని అన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు.

No Confidence Motion: మీ కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది, మీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలి, రాహుల్ గాంధీపై ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ

Hazarath Reddy

మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది.

No Confidence Motion: మోదీ అహంకారం వ‌ల్ల దేశం త‌గ‌ల‌బ‌డిపోతోంది, మీరే దేశ ద్రోహులంటూ లోక్ సభలో బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Trust Motion)పై రెండోరోజు చర్చ ప్రారంభమైంది.ఈ చర్చ సందర్భంగా మణిపుర్‌ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. బీజేపీపై విరుచుకుపడ్డారు.ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement
Advertisement