Politics

Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ గెలుపు.. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించి విజయతీరాలకు..

Rudra

ఇరాన్‌ లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ గెలిచారు.

Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.

Chennai Shocker: తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు

Hazarath Reddy

తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ ఈరోజు, జూలై 5, చెన్నైలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తుల బృందం ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హతమార్చింది.

Chandrababu's Hyderabad Visit: వీడియో ఇదిగో, హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు, రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు

Advertisement

Andhra Pradesh: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలని కోరారు.

Dwarampudi Chandrasekhar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు, ఆయన అనుచరులతో సహా 24 మందిపై కేసు

Hazarath Reddy

కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగు అక్రమమంటూ అధికారులు కూల్చేస్తుండగా అడ్డుపడ్డ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

UK General Election Results 2024: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్

Rudra

యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.

Shock to BRS: బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

Rudra

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Hemant Soren Oath Ceremony: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపట్టిన హేమంత్‌ సోరెన్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయించారు.

Jagan Warns Chandrababu : వీడియో ఇదిగో, రేపు మీ కార్యకర్తలకు ఇదే గతి, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి

Jagan Hits Out at Chandrababu: ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ప్రజలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి.

Advertisement

CM Chandrababu Meets PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్యా చర్చలు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చర్చించారు.

YS Jagan To Meet Pinnelli Ramakrishna Reddy: వీడియో ఇదిగో, నెల్లూరు చేరుకున్న జగన్, ఘన స్వాగతం పలికిన అభిమానులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ దిగిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారు.

KCR Slams Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి

Telangana: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Advertisement

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే

Hazarath Reddy

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.

Champai Soren Resigns as Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా, మళ్ళీ సీఎంగా హేమంత్‌ సోరెన్‌

Hazarath Reddy

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు చేరుకున్న చంపై గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ రంగం సిద్ధం చేసుకున్నారు

Keshava Rao Joins Congress: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Andhra Pradesh: అమరావతిని చూస్తే ఎంతో బాధ కలుగుతోంది, నా కష్టం అంతా జగన్ వృథా చేశాడని మండిపడిన చంద్రబాబు, శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి కోసం తాము పడిన కష్టం అంతా వృథా అయిందన్నారు. అయిదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు.

Advertisement
Advertisement