Politics
Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!
Rudraఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.
Shabbir Ali on PM Modi: నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు, మంగళసూత్రం గురించి ఏం తెలుసు, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తీవ్ర వ్యాఖ్యల వీడియో ఇదిగో
Hazarath Reddyతెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ ఆలీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
Venkaiah Naidu Gets Padma Vibhushan 2024: వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ అవార్డు, ప్రజా వ్యవహారాల రంగంలో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Hazarath Reddyరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 22, 2024 సోమవారం నాడు ప్రజా వ్యవహారాల రంగంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సమక్షంలో రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Telangana Lok Sabha Elections 2024: కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి రూ. 4,500 కోట్లకు పైగానే, చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్
Hazarath Reddyచేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను మే 15కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు, ఆరోగ్యంపై వేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మే 15న విచారణకు ఢిల్లీ హైకోర్టు సోమవారం పోస్ట్ చేసింది.
PM Modi 'Muslim' Remark: ప్రధాని మోదీ ‘ముస్లిం’ వ్యాఖ్యల దుమారం, వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని 'మన్మోహన్ సింగ్' దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉందని చెప్పినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Andhra Pradesh Elections 2024: పులివెందులలో సీఎం జగన్‌ తరఫున నామినేషన్ దాఖలు, ఈ నెల 25వ తేదీన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు.
Andhra Pradesh Elections 2024: ఏపీ నుంచి మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, పూర్తి లిస్టు ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు
Kakinada Memantha Siddham Sabha: జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్
Hazarath Reddyమేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు.
Madhavi Latha Arrow at Mosque Video: మసీదు వైపు బాణం విడుస్తున్నట్లుగా మాధవీలత యాక్షన్, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ఒవైసీ, బీజేపీ అభ్యర్థి రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
2024 భారతదేశం ఎన్నికలు: రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, క‌డియం శ్రీహ‌రికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని అన్నారు.
2024 భారతదేశం ఎన్నికలు: రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపు
Hazarath Reddyదేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది.ఈ సందర్భంగా యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: గత పదేళ్ళ గాయానికి మీ ఓటుతో చికిత్స చేయండి, మీ శక్తిమంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించి ప్రేమ దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
Hazarath Reddyదేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు
Telangana Elections 2024: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు
Lok Sabha Election 2024: కోయంబత్తూరులో ఓటు హక్కును వినియోగించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Lok Sabha Election 2024: వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే, ముందు మీ ఓటు వేసి ఇతర పనులు చేసుకోవాలని పిలుపు
Hazarath Reddyజ్యోతి అమ్గే, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందింది మరియు 2012లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో కనిపించినందుకు పేరుగాంచింది, ఈ రోజు తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో తన సిరా వేసిన వేలిని ప్రదర్శిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది.
Andhra Pradesh Elections 2024: వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ ఈస్ట్ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
Hazarath Reddyవిశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అధినేత నారా చంద్రబాబునాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Lok Sabha Election 2024: సమయం లేదు మిత్రమా.. పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధూవరులు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఉదంపూర్‌లో పెళ్లి చేసుకున్న వెంటనే మరో కొత్త జంట తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరుడు తన వధువుతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం అందరూ ఓటు వేయాలని వధువు విజ్ఞప్తి చేశారు.
India Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్, నటులు రజినీకాంత్, అజిత్ (వీడియోలు)
Rudraసార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు.