Delhi Assembly Elections 2020 -Amit shah vs Aravind kejriwal (Photo-PTI)

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరిగినట్టుగా చెబుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్య సాగింది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ, ఆప్ రెండు సీట్లలో విజయం సాధించాయి. ఇరు పార్టీలు సరిసమానంగా 112 సీట్లలో లీడ్ లో ఉన్నాయి. కౌంటింగ్ జరుగుతోంది.

Here's ANI Tweet