JMM chief Hemant Soren | (Photo Credits: Facebook)

Ranchi, August 26: జార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి, సీఎం హేమంత్‌ సోరెన్‌పై (CM Hemant Soren) అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సిఫారసు చేసిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా (recent political developments in the state) మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోరెన్ పట్ల గవర్నర్‌ ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారోనని చర్చ మొదైలైంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం సోరెన్‌ నేడు అధికారపక్ష ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. రాంచీలోని తన నివాసంలో జరుగనున్న ఈసమావేశానికి జేఎంఎంతోపాటు అధికార కూటమిలోని యూపీఏ ఎమ్మెల్యేలను (UPA MLAs) కూడా ఆహ్వానించారు.

హర్యానా సీఎం హేమంత్ సోరెన్‌ మైనింగ్‌ లీజు వ్యవహరంలో స్వీయ లాభం పొందారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బాయిస్‌కు సూచించినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే దీనిపై రాజ్‌భవన్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 192 ప్రకారం.. చట్టసభకు ఎన్నికైన ప్రతినిధిపై అనర్హత వేటు నిర్ణయం అంతిమంగా గవర్నరే తీసుకోవాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్, పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నానని లేఖ

ఈ క్రమంలో బీజేపీ నేతలపై సీఎం మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఉన్న నివేదికను కమలదళం నేతలే సొంతంగా రూపొందించి ఉంటారని ఎద్దేవా చేశారు. ఓ బీజేపీ ఎంపీ, ఆయన చేతిలో కీలుబొమ్మల్లా ఉండే విలేకర్లు కొందరు ఓ తప్పుడు నివేదికను రూపొందించి అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.అనర్హతవేటు నిర్ణయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని సొరేన్‌ తెలిపారు. తనపై అనర్హత వేటుకు ఈసీ సిఫారసు చేసిందంటూ బీజేపీ నేతలు చెబుతుండటంపై సోరెన్‌ మండిపడ్డారు.రాజ్యాంగబద్ధ సంస్థలను, ప్రభుత్వ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని సీఎం విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కొనుగలరేమోగానీ, ప్రజా మద్దతుని కాదని మోదీ సర్కారుకు చురకలు అంటించారు. ప్రజల మద్దతే తనకు అఖండ బలమని పేర్కొన్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ, తదుపరి సుప్రింకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్, చివరి రోజు ఐదు కేసుల్లో కీలక తీర్పును వెలువరించనున్న సీజీఐ రమణ

ఒక వేళ అనర్హత వేటు పడితే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు జేఎఎం తెలిపింది.జేఎంఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూటమిలోని ప్రధాన పార్టీగా కాంగ్రెస్ దానికి మద్దతు ఇస్తుంది అని జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాకు ఇదే సూచన చేసిందని ఆయన అన్నారు. అంతా బాగానే ఉంది. మా ప్రభుత్వం మెజారిటీలో ఉంది. మా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏది చెబితే అది పాటిస్తామని జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా తెలిపారు.

Here's Updates

తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే డిమాండ్‌ చేశారు. అయితే, తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్‌ నేత, మంత్రి అలంగిరీ ఆలమ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సొరేన్‌పై అనర్హత వేటు పడినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.

అసలు ఏమిటీ వివాదం?

స్టోన్‌ చిప్స్‌ మైనింగ్‌ లీజును తన పేరున సొరేన్‌ పొందారంటూ గవర్నర్‌ రమేశ్‌ బాయిస్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్‌ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 9ఏ ప్రకారం సొరేన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్‌ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్‌ కవర్‌లో తన అభిప్రాయాన్ని ఈసీ రాజ్‌భవన్‌కు పంపించింది.