Newdelhi, Dec 24: ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మాజీ సీఈవో చందా కొచ్చర్ (Chanda Kochhar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar) లను సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు.
అసలేం జరిగింది?
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో హోదాలో ఉండగా 2012లో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది.
CBI has arrested former MD & CEO of ICICI bank Chanda Kochhar & Deepak Kochhar in the alleged ICICI bank - Videocon loan fraud case
(File Picture) pic.twitter.com/I7kmu09pjE
— ANI (@ANI) December 23, 2022