Hyderabad, Dec 24: హైదరాబాదులోని (Hyderabad) గోషామహల్ (Gosha Mahal) లో ఓ రోడ్డు (Road) ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయింది (Collapsed). దీంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చక్నావాడిలో పట్టపగలు ఓ నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. దాని వల్ల పెద్ద గుంత ఏర్పడగా, అందులో పలు కార్లు (Cars), ఆటోలు (Autos) పడిపోయాయి. ఆ ప్రాంతంలో సంత జరుగుతుండగా, పలు కూరగాయల దుకాణాలు కూడా ఆ గోతిలో పడిపోయాయి.
ఈ ఘటనతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి సహాయకచర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
నగరంలో పురాతనమైన నాలాలు ఉన్నాయని, ఇష్టానుసారం ఆక్రమణలకు పాల్పడడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని వివరించారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని తెలిపారు.
Nope! Not an Earthquake! Just a naala road in #Hyderabad which decided to give up!
A naala in Chaknawadi, Goshamahal in #Hyderabad crumbles taking down an entire market &vehicles along with it. There was a Friday street market when the incident happened, luckily no one hurt! pic.twitter.com/S6TEso4Rcb
— Revathi (@revathitweets) December 23, 2022