Credits: X

Newdelhi, Aug 15: దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబురాలు (Independence day Celebrations) అంబరాన్నంటాయి. సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) గొప్ప శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎర్రకోటపై జాతినుద్దేశించి మాట్లాడుతూ.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్తీల కోసం  వచ్చే మరికొన్ని నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు.

Independence Day Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ 10వ ప్రసంగం.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటన (వీడియోతో)

స్కీమ్ ఎప్పుడు ప్రారంభం అంటే?

సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.

Independence Day 2023 Wishes in Telugu: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేసెజ్ ద్వారా చెప్పేయండి