Flexitarian Diet: మాంసాహారులు మహానుభావులు! పూర్తిగా శాఖాహారమే తింటే పర్యావరణానికి ముప్పే, భోజనంలో మాంసం ఉంటేనే వాతావరణంలో సమతుల్యత. ఓ అధ్యయనంలో వెల్లడి
Representational Image| Semi- Vegetarianism| Photo: Twitter

మనలో కొంత మంది శాఖాహారులు ఉంటారు, ఇంకొంత మంది మాంసాహారులుంటారు.  నీకేం ఇష్టం అని శాఖాహారులను అడిగితే పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, అవకాయ, ములక్కాడ పులుసు, అప్పడం అంటూ ఇలా పెద్ద లిస్ట్ చెప్తారు. అదే పాపం నాన్-వెజిటేరియన్స్  చికెనో, మటనో, లేదా ఫిష్ లాంటి ఏదో ఒక్క కూరతోనే అడ్జస్ట్ చేసుకున్నా 'ఐ హేట్ కిల్లింగ్ యానిమల్స్' అనేస్తారు. అసలు ఒక ప్రాణిని చంపి ఎలా తింటారు? వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అంటూ జాతిపితలాగా  సలహాలు ఇస్తారు.  చాలా మంది పర్యావరణవేత్తలు కూడా శాఖాహారానికే మద్ధతిచ్చారు. కానీ, తాజాగా చేపట్టిన ఓ పరిశోధన అసలు విషయాన్ని బయటపెట్టింది.

అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ( JHU- Johns Hopkins University) వారు ఒక భారీ అధ్యయనాన్ని చేపట్టారు. ప్రపంచలోని దాదాపు 140 దేశాలలో గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్  (Greenhouse Effect) ఎలా ఉంది అనే అంశంపై ఆ విశ్వవిద్యాలయంకు చెందిన విద్యావంతులు అధ్యయనం చేపట్టారు. వారి అధ్యయనాన్ని సరళీకరించి చెప్పాలంటే, మనం చిన్నప్పుడు గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ గురించి చదువుకొని ఉంటాం. "భూమి నుంచి వెలువడే కర్బన వాయువులు కారణంగా ఓజోన్ పొరకు రంధ్రం పడుతుంది, దీనివల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. తద్వారా సకాలంలో వర్షాలు పడటం లేదు, ఎండలు పెరుగుతాయి, అకాల వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీనినే గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అంటారు" అని చదువుకున్నాం.

మరి గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ కు కారణమయ్యే వాయువులు కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు క్లోరో ఫ్లోరో కార్బన్స్. ఇక్కడ కార్బన్ డై ఆక్సైడ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. మాంసాహారుల నుంచి విడుదలవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు కన్నా శాఖాహారుల నుంచి విడుదలవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు ఎక్కువని తేలింది. ఒక్క యూకేలోనే మాంసాహారుల నుంచి విడుదలైన కార్బన్ ఉద్గారాల (Co2 emission)  మోతాదు 762.7 కిలోలకు సమానంగా ఉండగా, వెజిటెబుల్స్, నెయ్యి, పాలు, పెరుగు, ఇతర శాఖాహార ఆహరం తీసుకున్న వారి నుంచి విడుదలైన ఉద్గారాల మోతాదు 1,265.2 కిలోలు అని తేలింది.  మాంసాహారంలో ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా ఉండటం కారణంగానే దాని నుంచి కర్బన ఉద్గారాల మోతాదు తక్కువ.   ఇదీ చదవండి: బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం మంచిదే, ఎప్పుడంటే...

దీనిని బట్టి వారి అధ్యయనం చెపుతున్నదేంటంటే పూర్తిగా శాఖాహారం తినడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాల మోతాదు అధికంగా ఉంటుంది. అది పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుంది కాబట్టి శాఖాహారంలో కొంతవరకు మాంసాహారాన్ని కలిపి తీసుకోవాలి అని చెపుతున్నారు. ఇలా తినేవారిని అమెరికాలో ఒక కొత్త జాబితాలో కూడా చేర్చారు. వీరు పూర్తిగా వెజిటేరియన్స్ లేదా పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ అని కాకుండా అందరి సౌకర్యం కోసం ఫ్లెక్సిటేరియన్ (flexitarian) అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. తెలుగులో ఇంకా ఈ పదానికి పేరు పెట్టలేదు కాబట్టి "మాంశాఖా హారులు" అని ప్రస్తుతానికి చెప్పుకుందాం. ఇది అసలు విషయం.