New COVID Variant JN.1 Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌.1 సోకినట్లే, రెండు రోజుల పాటు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచన
COVID-19 representational image (Photo Credit- IANS)

New Delhi, Dec 21: దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 (COVID variant JN.1) కలవరం పుట్టిస్తోంది. దీని ప్రభావంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. కాగా కరోనా వైరస్‌ జేఎన్‌.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్‌లో ఇది అక్కడ విజృంభించగా డిసెంబర్‌ మొదటివారంలో చైనాలో వెలుగు చూసింది. ఇప్పుడు భారత్‌లో కేరళలో బయటపడింది.

ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అయిన జేఎన్‌.1 కేసులు దేశంలో 21 నమోదైనట్లు ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. కొత్త వేరియంట్‌తో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్‌.1 వేరియంట్‌ అంత ప్రమాదకరమైంది ఏం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కోవిడ్ సార్‌కోవ్ 2తో చాలా డేంజర్ అంటున్న వైద్యులు, ఇది సోకడంతో అమెరికాలో మాటను కోల్పోయిన బాలిక, వైద్యులు ఏమంటున్నారంటే..

జేఎన్‌.1ను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ (variant of interest)గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని (New COVID variant JN.1 Drives Surge In Cases) వివరించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్ జేఎన్‌.1, గత 24 గంటల్లో 358 కేసులు, ఒక్క కేరళ లోనే 300 కేసులు, 2,669కి పెరిగిన యాక్టివ్ కేసులు

ఇక ఈ కొత్త వేరియంట్‌ లక్షణాల (New COVID Variant JN.1 Symptoms) విషయానికొస్తే.. వైరస్‌ సోకిన వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు మంట, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రమే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త వేరియంట్ లక్షణాలివే..

జ్వరం, ఒళ్లు నొప్పులు

జలుబు.. ముక్కు కారడం,

గొంతు నొప్పి,

వాసన-రుచి శక్తిని కోల్పోవడం,

తలనొప్పి..

కొందరిలో కడుపు నొప్పి, గ్యాట్రిక్‌ సమస్య

వాంతులు, విరేచనాలు

మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు

పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే.. ఐసోలేషన్‌ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండేవాళ్లకు వైరస్‌ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరస్సే సోకకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.