Covid in India (PIC @ PTI)

New Delhi, Dec 21: దేశంలో కరోనా వైరస్‌ కల్లోలం రేపుతోంది. కరోనా వైరస్‌ జేఎన్‌.1 వేరియంట్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,669కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్‌ కేసులు (COVID Cases in India) నమోదయ్యాయి. ఇందులో 5,33,327 మంది మరణించారు.

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌కు చెందిన కొత్త కేసులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో ముగ్గురు మరణించాగా, కొత్త కేసుల్లో 300 కేరళం రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మూడు రాష్ట్రాలకు పాకిన కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1, దేశంలో 20 కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు, గోవాలోనే 18 కేసులు

అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది.తాజా మరణాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది.కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది.

కేరళలో కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.