Viral

Online Cricket Betting Racket Busted: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు, రూ. 43. 57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

Hazarath Reddy

ఐపీల్ ప్రారంభం కావడంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ స్ఠాయిలో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్ మరియు మియాపూర్ పోలీసుల SOT బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను చేధించారు.

SPF Constable Suicide: షాకింగ్ వీడియో, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, బ్యాంకు సీసీటివీలో ఘటన రికార్డ్

Hazarath Reddy

విశాఖపట్నం (Visakha)లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Fake Cigarettes Seized: నకిలీ సిగిరెట్ల గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగిరెట్లు స్వాధీనం

Hazarath Reddy

శంషాబాద్‌లో ఎస్‌ఓటీ రాజేంద్ర నగర్‌లో రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగరెట్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బీహార్, హర్యానా మరియు హైదరాబాద్ నుండి వాటిని అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. 267 కార్టన్‌ల నిషేధించిన సిగరెట్లు బీహార్ నుండి హైదరాబాద్‌కు రవాణా అవుతున్నాయి.

McKinsey Layoffs: ఆగని లేఆప్స్, 360 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గ్లోబ‌ల్ క‌న్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

గ్లోబ‌ల్ క‌న్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

Advertisement

Jr NTR In War 2: వార్‌ 2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, 10 రోజుల పాటు తారక్ ఆర్థిక రాజధానిలోనే.. వీడియో ఇదిగో..

Vikas M

హృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు

Dbrand Apology to Indian Techie: భారతీయుని పేరును వెటకారం చేసిన కెనడా కంపెనీ, నెటిజన్లు దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు, అయినా సరే..

Vikas M

ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైన కెనడా కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చి భారతీయునికి క్షమాపణలు చెప్పింది. దీనిపై ఎక్స్ వేదికగా అతనికి గుడ్ విల్ కింద 10 వేల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. విషయంలోకి వెళ్తే..భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పాలన సూపర్ అంటున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ కితాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయాల రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ‌ను తీసుకొచ్చారంటూ కితాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని వైఎస్సార్సీపీ తన ఎక్స్ లో షేర్ చేసింది. మళ్లీ వచ్చేది జగనే అంటూ క్యాప్షన్ జోడించింది.

Khagen Murmu Kissing Controversy: ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ ఎంపీ, మోదీ పరివార్‌ ఇదేనంటూ విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీఎంసీ, ఘటనపై ఎంపీ ఏమన్నారంటే..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి యువతి బుగ్గపై ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ న్యూస్ లోకి వెళ్తే.. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) పోటీ చేస్తున్నారు.

Advertisement

Tamil Nadu Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు, అయిదుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తమిళనాడులోని మధురై సమీపంలో విరుదునగర్ - మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఈరోజు ఉదయం వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు

Devara Part 1: దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1

Vikas M

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Heeramandi Trailer Out: హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్

Vikas M

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు

Advertisement

Goud Saab: ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న గణేష్ మాస్టర్

Vikas M

టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెర‌కెక్క‌బోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ భీమ్లా నాయ‌క్ ఫేమ్ గ‌ణేష్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోంది.

'Testicular Eclipse': షాకింగ్ వీడియో, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మనిషి పురుషాంగంతో కూడిన వృషణాలను లైవ్ ప్రసారం చేసిన మీడియా

Hazarath Reddy

మెక్సికన్ న్యూస్ అవుట్‌లెట్, ఆర్‌సిజి మీడియా, సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క కవరేజ్ సమయంలో వీక్షకులు సమర్పించిన చిలిపి వీడియోని అనుకోకుండా ప్రసారం చేసినందుకు ఆన్‌లైన్‌లో అపహాస్యం, ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఒక వ్యక్తి తన వృషణాలతో సూర్యుడిని అస్పష్టం చేస్తున్న క్లిప్‌ను కలిగి ఉంది

Murder Caught on Camera: వ్యాపారంలో తగాదాలు, నడిరోడ్డు మీద ఇద్దరిని కాల్చిన ప్రత్యర్థులు, ఒకరు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

బెయిల్‌పై విడుదలైన ఓ హత్య నిందితుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ బర్మా ప్రకారం, కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్ ట్రై-సెక్షన్ వద్ద కొంతమంది వ్యక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది, వారిలో ఒకరు కాల్పులు జరిపారు

Hyderabad Shocker: ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త

sajaya

ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపేసిన భర్త. సన్‌సిటీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ముందు తన భార్య, వారి ఐదేళ్ల కొడుకును హత్య చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Eid Al-Fitr Wishes in Telugu: ఈద్ ముబారక్ చెప్పేందుకు బెస్ట్ ఇమేజెస్, రంజాన్ శుభాకాంక్షలు చెప్పేందుకు బెస్ట్ కోట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి, విషెస్ చెప్పేయండిక

Hazarath Reddy

ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది.

Eid Mubarak Wishes in Telugu: రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు బెస్ట్ ఇమేజెస్, ఈద్ అల్-ఫితర్ విషెస్ ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి, ఈద్ ముబారక్ మెసేజెస్ మీకోసం..

Hazarath Reddy

ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.

Ravindra Jadeja: ఐపీఎల్ చరిత్రలో రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు, 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జడ్డూ

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సంచలన రికార్డు నమోదు చేశాడు. 17 ఏళ్ల క్యాష్‌ ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్‌లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Pakistan Squad for T20I Series: మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజం, 4 ఏళ్ల‌ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదిగో..

Hazarath Reddy

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌తో బాబ‌ర్ ఆజం మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్న పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌ మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Advertisement
Advertisement