Viral
BenevolentAI Layoffs: ఫార్మా లేఆఫ్స్ కంటిన్యూ, 180 మంది ఉద్యోగులను తీసేసిన బెనెవోలెంట్‌ఏఐ, రాజీనామా చేసిన కంపెనీ సీఎఫ్ఓ నికోలస్ కెహెర్
Hazarath Reddyయుకెకు చెందిన AI డ్రగ్ డిస్కవరీ కంపెనీ బెనెవోలెంట్‌ఏఐ వ్యూహాత్మక సమీక్ష ఫలితంగా ఏర్పడిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సుమారు 180 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా, CFO (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) నికోలస్ కెహెర్ రాజీనామా చేశారు
Airmeet Layoffs: ఆగని లేఆప్స్, 75 మంది ఉద్యోగులను తీసేసిన ఈవెంట్స్ ప్లాట్‌ఫామ్ ఎయిర్‌మీట్, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyహోమ్‌గ్రోన్ వర్చువల్ ఈవెంట్స్ ప్లాట్‌ఫామ్ ఎయిర్‌మీట్ దాదాపు 75 మంది ఉద్యోగులను తొలగించింది, దాదాపు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించింది, ఇది వివిధ విభాగాలలోని సిబ్బందిని ప్రభావితం చేసింది.
JPMorgan Chase Layoffs: బ్యాంకింగ్ రంగంలో లేఆప్స్, 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న జేపీ మోర్గాన్‌ చేజ్‌
Hazarath Reddyజేపీ మోర్గాన్‌ చేజ్‌ ఈ వారంలో దాదాపు 500 మంది ఉద్యోగులను బ్యాంక్‌ నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ బిజినెస్‌ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపులు కంపెనీ వ్యాప్తంగా జరుగుతాయి,
Earthquake in Assam: అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం.. తీవ్రత 4.4గా నమోదు
Rudraఅస్సాం (Assam), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో (Sonitpur) భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Pornhub on Elon Musk's Device? మంచి రసికుడే, ఎలాన్ మస్క్‌ ఫోన్లో పోర్న్ వీడియోలు, ట్విట్టర్ నా ఫోన్ స్పేస్ తినేస్తుందంటూ చేసిన ట్వీట్‌తో విషయం వెలుగులోకి..
Hazarath Reddyఎలాన్ మస్క్ తాజా ట్వీట్‌లో ఈ మధ్య ఓ స్క్రీన్‌షాట్‌ను (అతని పరికరం యొక్క ఉద్దేశ్యంతో) పంచుకున్నాడు. అందులో ట్విట్టర్ యాప్ 'చాలా స్థలాన్ని తినేస్తోందని ఉంది.అది మొత్తం స్థలాన్ని వినియోగించడానికి ట్విట్టర్ వైపు బాణం చూపుతోంది; అయినప్పటికీ, దాని పైన, పోర్న్‌హబ్ యొక్క 'హబ్' పదాన్ని చూడవచ్చు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది.
Accident in Banjarahills: హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు
Rudraహైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని రెయిన్ బో హాస్పిటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొంది. ఆ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి
Rudraప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Dhirendra Shastri: ఇలా చేస్తే, పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేస్తాం.. స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్య
Rudraగుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశిస్తూ.. ఇక్కడకు ప్రజలందరూ వచ్చినట్టే, ఐకమత్యంతో మనం ఉంటే పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేయగలమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Rains in Telangana: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం
Rudraరానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది.
Accident in Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తాపడ్డ కారు.. ప్రమాద ఘటనలో ఏడుగురు విద్యార్థుల మృతి
Rudraఅస్సాంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహతిలోని జలుక్బరీ ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
Viral Video: 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది.. ఆనందం పట్టలేక చిన్నారిని ఏనుగుపై ఊరేగించిన పేరెంట్స్.. మహారాష్ట్రలోని పచ్‌గావ్‌లో ఘటన.. వేడుక చూసేందుకు కదిలివచ్చిన గ్రామస్థులు.. వీడియో ఇదిగో!
Rudraపుట్టబోయేది అమ్మాయని తెలిసి గర్భంలోనే చిదిమేస్తున్న ఘటనలు నిత్యకృత్యమైన వేళ.. లేక లేక కలిగిన ఆడపిల్లను ఏనుగుపై ఊరేగించింది ఓ కుటుంబం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గిరీశ్ పాటిల్‌కు ఐదు నెలల క్రితం పాప పుట్టింది. ఆ వంశంలో అమ్మాయి పుట్టడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో...
Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??
Rudraటాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.
Heat Waves in AP: నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు.. రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత
Rudraసూర్యుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
New Parliament Building Inauguration Live Updates: అంగరంగ వైభవంగా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం.. రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించిన మోదీ.. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
Rudraప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం (New Parliament Building Inauguration) అంగరంగ వైభవంగా మొదలైంది. తొలుత లోక్‌సభ స్పీకర్ (Loksabha speaker) ఓంబిర్లా(Om Birla)తో కలిసి పార్లమెంటులోని (Parliament) మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు.
Voter List Verification in Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ.. జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే.. అక్టోబర్ 10న తుది జాబితా విడుదల.. అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
Rudraతెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..
Rudraభారత ప్రజాస్వామ్య ప్రయాణంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. నేడు ఉదయం 7.15 గంటలకు ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
Allahabad High Court: ఎక్కువ కాలం భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే.. అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్య
Rudraతగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ రవీంద్ర యాదవ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది.
Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??
Rudraప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.