Viral

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Rudra

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Rudra

అమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు.

Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు

Arun Charagonda

బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.

Advertisement

Rohit Sharma Injured: ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు వేళ టీమిండియాకు భారీ షాక్‌.. రోహిత్‌ శర్మ మోకాలికి గాయం

Rudra

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌ లో సూపర్‌ ఫామ్‌ మీదున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడగా.. తాజాగా కెప్పెన్‌ రోహిత్‌ శర్మ కూడా గాయపడ్డాడు.

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Rudra

అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు.

Murder in Bowenpally: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్య.. హైదరాబాద్ బోయిన్ పల్లిలో దారుణం (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి హత్య చేశారు.

Delhi High Court: పరస్పర సమ్మతితో చేసే శృంగారం రేప్‌ కాదు.. వేధింపుల కోసం చట్టాన్ని వాడుకోవద్దు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Rudra

పరస్పర సమ్మతితో జరిగిన శృంగారాన్ని రేప్ కేసు కింద పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు అన్నట్టు మహిళలు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.

Advertisement

Blade Found in Biryani: బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్‌ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో ఉన్న ఆదర్శ్ బార్ & రెస్టారెంట్‌ లో వడ్డించిన ఓ బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్‌ కి బిర్యానీ తింటుండగా ఈ బ్లేడు కనిపించినట్టు తెలుస్తుంది.

Gun Fire in AP: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్రగాయాలు.. అసలేం జరిగిందంటే??

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు.

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఊపిరిపీల్చుకునే విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

Allu Arjun: వీడియో ఇదిగో, నేను పర్మిషన్ లేకుండా వెళ్లాను అనేది పచ్చి అబద్ధం, నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారని తెలిపిన అల్లు అర్జున్

Hazarath Reddy

నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధం. పర్మిషన్ లేకుంటే పోలీసులే నన్ను తిరిగి పంపిస్తారు.. కానీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారని అల్లు అర్జున్ అన్నారు.

Advertisement

Allu Arjun on Sandhya Theatre stampede: వీడియో ఇదిగో, నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయానని తెలిపిన అల్లు అర్జున్

Hazarath Reddy

లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశాను.అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా..

Allu Arjun on Sandhya Theatre Stampede: వీడియో ఇదిగో, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేసింది, అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా అంటే అల్లు అర్జున్ ఎమోషన్

Hazarath Reddy

నేను రోడ్డు షో చేయలేదు. నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్దం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు. మా మేనేజర్ వాళ్ళు వచ్చి బైట ఓవర్ క్రౌడ్ ఉంది మీరు వెళ్లిపోండి అంటే వెళ్ళిపోయా.నా భార్య, పిల్లలు నా పక్కనే ఉన్నారు.. అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్ళను థియేటర్లోనే వదిలి వెళ్ళను కదా.

Allu Arjun on Victim Sritej: వీడియో ఇదిగో, నా కొడుకు ఎంతో శ్రీతేజ్ కూడా అంతే నాకు, అతనికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నామని తెలిపిన అల్లు అర్జున్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.

Uttarakhand: విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలం, కొండపై కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిన రాకపోకలు..వీడియో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా విరిగిపడ్డాయి పెద్ద కొండచరియలు. పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిపోయాయి రాకపోకలు. సంఘటనా స్థలానికి చేరుకుని చెత్తను తొలగించడంలో నిమగ్నమయ్యారు అధికారులు.

Advertisement

Karnataka: కర్ణాటకలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి...ట్రక్కు-వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం

Arun Charagonda

బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నెలమంగలలో కంటైనర్ ట్రక్కు, వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం జరుగగా ప్రమాదంలో అందరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Viral Video: అదృష్టం అంటే ఇదే...ఎనమిది పల్టీలు కొట్టిన కారు...ప్రయాణికులు సేఫ్...వీడియో

Arun Charagonda

రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు కారు అదుపు తప్పి ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది.

Viral Video: రీల్స్ కోసం ఆటో టాప్ పై కుక్క..ఆపై ఏం చేశాడో తెలుసా?, ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు..వీడియో వైరల్

Arun Charagonda

ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆటో టాప్‌పై కుక్కని నిల్చొపెట్టి వాహనాన్ని నడిపాడు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

రష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement