Dubai, August 27: మరికొన్ని గంటల్లో క్రికెట్ మెగా ఈవెంట్ ఆసియా కప్- 2022 టోర్నీకి తెరలేవనుంది. దుబాయ్ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ఆరంభం కానుంది. ఇక భారత్, శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫైయర్స్‌లో నెగ్గిన హాంకాంగ్ సైతం పాల్గొననుంది. గ్రూపు- ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ జట్టు ఉండగా.. గ్రూప్- బిలో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. మరి.. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 ఈవెంట్ పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర పూర్తి వివరాలు...
Group Phase
Sri Lanka vs Afghanistan, August 27, 7:30 PM IST, Dubai
India vs Pakistan, August 28, 7:30 PM IST, Dubai
Bangladesh vs Afghanistan, August 30, 7:30 PM IST, Sharjah
India vs Hong Kong, August 31, 7:30 PM IST, Dubai
Sri Lanka vs Bangladesh, September 1, 7:30 PM IST, Dubai
Pakistan vs Hong Kong, September 2, 7:30 PM IST, Sharjah
Super 4 Phase
B1 vs B2, September 3, 7:30 PM IST, Sharjah
A1 vs A2, September 4, 7:30 PM IST, Dubai
A1 vs B1, September 6, 7:30 PM IST, Dubai
A2 vs B2, September 7, 7:30 PM IST, Dubai
A1 vs B2, September 8, 7:30 PM IST, Dubai
A2 vs B1, September 9, 7:30 PM IST, Dubai
Final
1st in Super 4 vs 2nd in Super 4, September 11, 7:30 PM IST, Dubai
మ్యాచ్ ఆరంభ సమయం
టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఆసియా కప్ 15 ఎడిషన్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం
ప్రసార వేదికలు
స్టార్ స్పోర్ట్స్ చానెల్
లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‌స్టార్