Naseerullah (Credits: Twitter)

Kolkata, May 26: నిన్నటివరకూ బ్యాంకు ఖాతాలో (Bank Account) రూ. 17 మాత్రమే ఉన్న ఓ దిన సరి కూలి (Daily Wage Worker) రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్​ అకౌంట్‌కు ఉన్నపలంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలీక ఆ కూలీ అష్టకష్టాలు పడ్డాడు. అసలేం జరిగింటే.. బెంగాల్ (Bengal) దేగంగాలోని వాసుదేవ్​పుర్‌కు చెందిన మహ్మద్ నసీరుల్లా (26) ఓ వ్యవసాయ కూలీ. నసీరుల్లాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (State Bank Of India) బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్‌లో రూ.17 మాత్రమే ఉన్నాయి. ఐతే తాజాగా తన అకౌంట్‌లో రూ.100 కోట్లు జమ అయినట్లు నసీరుల్లా గుర్తించాడు.

Car Crashes Into Gates Of UK PM Residence: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అధికారిక నివాసంపై కారుతో దుండగుడి దాడి.. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలోనే రిషీ సునాక్.. వీడియోతో

Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి

కూలీకి నోటీసులు

నసీరుల్లా జంగీపుర్ సైబర్ క్రైమ్​ పోలీసులు నోటీసులు పంపారు. మే 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన నసీరుల్లా ఆ డబ్బులు తన అకౌంట్‌కు ఎలా వచ్చి చేరిందో తెలియక తలపట్టుకున్నాడు. దీంతో బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో బ్యాంకు అధికారులు నసీరుల్లా బ్యాంక్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

Saivarshith-Biden Case: బైడెన్‌ను చంపేందుకే వచ్చానన్న తెలుగు యువకుడు సాయివర్షిత్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా?!