Credits: Twitter

Chennai, June 12: రైలు ప్రమాద ఘటనలు (Train Accidents) ఇటీవల ఎక్కువయ్యాయి. చెన్నైలో (Chennai) ఓ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. తిరువళ్లూరు (Tiruvallur) వెళుతున్న ఈ రైలు బేసిన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఈఎంయూ (EMU) రైలులో చివరి నుంచి రెండో కంపార్ట్ మెంట్ పక్కకి ఒరిగిపోయింది. ఇది లేడీస్ కంపార్టమెంట్. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి బయల్దేరిన 8 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈఎంయూ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ఇతర రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.

Tiger Eats Grass: మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు.. అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.. ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు

ప్రయాణికులు భయంభయం

ప్రమాదం జరిగిన సమయంలో రైల్లోనే ఉన్నవారు, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ఆగిపోవడంతో హడలిపోయామని చెప్పారు. ఇక ఆ రైల్లో ప్రయాణించడానికి భయపడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే రైలు దిగేసి వెంటనే బస్సెక్కి గమ్యస్థానానికి వెళ్లిపోయాడు.

Honeymoon Tragedy: హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లిన నవదంపతుల దుర్మరణం.. అకస్మాత్తుగా బోటు బోల్తా పడటంతో ఘటన.. మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు