Newdelhi, June 12: ఎంత కరువొచ్చినా పులి (Tiger) గడ్డి (Grass) మేయదని సామెత. అయితే, ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన పరిస్థితి. అవును. పులి క్రూర జంతువు, మాంసాహారి అని అందరికీ తెలుసు. ఐతే, అలాంటి పులి గడ్డి తింటోందంటే మీరేమంటారు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని (Maharastra) యావత్మాల్ (yavatmal) జిల్లా మతాని గ్రామ అడవుల్లో రెండు పులులు గడ్డి తింటూ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాల్ని ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు.
అప్పుడు గడ్డి తింటుందట
మాంసాహారం జీర్ణం కాక కడుపు నొప్పి వచ్చినప్పుడు పులి గడ్డి తింటుందట. లేత గడ్డి తింటే ఆహారం త్వరగా జీర్ణమయ్యి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అందుకే, పులులు అప్పుడప్పుడూ ఇలా చేస్తాయని, అయితే ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.