Sanju Samson (PIC @ RR Twitter)

Chennai, April 27: ఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్‌ అయినపోయిన తర్వాత స్టేడియం నెట్ బయట ఉన్న ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సెల్ఫీ కోసం ఓ వ్యక్తి సంజూకు ఫోన్ ఇచ్చాడు. అదే సమయంలో అతనికి ఫోన్ వచ్చింది. అయితే ఫోన్ కట్ చేసి, సెల్ఫీ దిగకుండా...ఆ ఫోన్‌ ను లిఫ్ట్ చేసి సమాధానం (Sanju Samson Surprisingly Receives Call) ఇచ్చాడు సంజూ శాంసన్.

హా చెప్పండి భయ్యా...ఏం జరుగుతుంది అంటూ సంజూ ఆన్సర్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. సంజూ శాంసన్ చేసిన పనిపై ట్విట్టర్‌లో ఫ్యాన్స్ వెరైటీగా స్పందిస్తున్నారు. అది సంజూ అంటే...అని కొందరు రిప్లై ఇస్తుండగా, అభిమానులు అంటే సంజూకు ఎంత ప్రేమ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.