టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు. హరారే వేదికగా జింబాబ్వే (Zimbabwe)తో మూడో వన్డేలో..  97 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 130 పరుగులు సాధించి  వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్‌ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 130 పరుగులు సాధించిన గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

చివరి మ్యాచ్ లో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ.. అయినా విజయం దక్కలేదు

జింబాబ్వే గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత్‌ ఆటగాళ్లు వీరే.

శుబ్‌మాన్ గిల్ - 130

సచిన్ టెండూల్కర్ 127(నాటౌట్‌)

అంబటి రాయుడు 124

యువరాజ్ సింగ్ 120

శిఖర్ ధావన్ 116