జపాన్ రాజధాని టోక్యోలోని టొయొసు మార్కెట్‌లో జరిగిన వేలంలో బ్లూఫిన్ టూనా చేప 36 మిలియన్ యెన్‌లు( 2,73,000 డాలర్లు).. అంటే రూ.2.25 కోట్లు పలికింది. ఆవోమోరిలోని ఒమా దగ్గర ఈ చేపను పట్టుకున్నారు. దీని బరువు 212 కిలోల దాకా ఉంటుంది. ఒమా బ్లూఫిన్ టూనాను.. బ్లాక్ డైమండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈ భారీ చేపలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అందుకే అంతలా రేటు ఉంటుంది.మోటెసాండో జిల్లాలోని ఓనోడెరా రెస్టారెంట్‌లో దీన్ని వండి వడ్డిస్తారు. దేశంలోని అగ్రశ్రేణి చెఫ్‌లు మాత్రమే దీనిపై తమ పనితనం ప్రదర్శిస్తారు.
భారీ సైజులో ఉండే బ్లూఫిన్ టూనా చేప పట్టుకుని.. వేలం వేయడం ప్రతీ ఏడాది ఆనవాయితీగా వస్తోంది. 1999 నుంచి ఇది అరో గరిష్ఠ ధర. కిందటి ఏడాది 210 కేజీల దాకా బరువు ఉన్న చేపను వేలం వేస్తే.. 2,02,000 డాలర్లు వచ్చింది. 2020లో దాదాపు 300 కేజీల దాకా బరువు ఉన్న చేపను 1.8 మిలియన్ డాలర్లకు, ఇక 2019లో కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 3.1 మిలియన్ డాలర్లకు బ్లూఫిన్ చేప వేలంలో అమ్ముడు పోయింది.
Here's Video
Bluefin tuna fetches $273,000 at Japan auction after COVID drop
212-kg catch from off northeastern Japan to go to Sushi Ginza Onodera diners.
Read the full story here: https://t.co/9izgi6V42L pic.twitter.com/L0jpDVKULc
— Nikkei Asia (@NikkeiAsia) January 5, 2023
బ్లూఫిన్ మళ్లీ 3 మిలియన్ డాలర్లను తాకుతుందా లేదా అనేది చూడాలి. మహమ్మారి ఏ విధంగానూ ముగియలేదు. బ్లూఫిన్ ట్యూనా వంటి జాతుల కోసం ఫిషింగ్ యొక్క స్థిరత్వ అంశం గురించి ఇటీవలి సంవత్సరాలలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రుచికరమైన దాని కోసం ప్రపంచ డిమాండ్ పెరుగుతున్నందున జీవరాశి సంఖ్య తగ్గుతూనే ఉంది.