Newdelhi, April 3: కేరళలో (Kerala) ఘోరం చోటు చేసుకుంది. రైలులో (Train) ప్రయాణిస్తున్న సమయంలో సీటు (Seat) కోసం వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు అంటుకొన్నాయి. దీంతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి ఓ బైక్ పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. అలప్పుజా – కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్‌లోని డీ1 కోచ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Three people were killed and many suffered burn injuries after an unidentified person poured inflammable oil on co-passengers and set them afire inside the D-1 coach of the Alapuzha-Kannur Express on Sunday.
(Reports Ramesh Babu)https://t.co/uAa2WyVUrY
— Hindustan Times (@htTweets) April 3, 2023
సీటు కోసం..
కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌ను దాటి కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణీకులు మహిళకు మద్దతుగా నిలిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ముగ్గురు మరణించారు.