మధ్యప్రదేశ్ భోపాల్‌లో అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్ కాగా.. కండక్టర్ మాత్రం ముందుస్టాప్ నుంచి టికెట్ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎన్‌సీసీ క్యాడెట్‌కు చెందిన సదరు ప్రయాణికుడు.. అధిక వసూలుపై నిలదీశాడు. తాను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. అయినా సరే ఐదు రూపాయలు ఇవ్వాలని, లేదంటే దిగిపోవాలని కండక్టర్ చెప్పాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.
Here's Video
NCC cadet thrashed city bus conductor in Bhopal, an argument broke out between the bus conductor and the NCC cadet over the difference of 5 rs. bus fare @ndtv @ndtvindia pic.twitter.com/hnA8B08sBw
— Anurag Dwary (@Anurag_Dwary) September 14, 2022
ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది రవాణా శాఖ. దీంతో సదరు ఎన్‌సీసీ క్యాడెట్‌పై జహాంగీర్‌బాద్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.