Bhopal, March 10: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress Politician), మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) కారు (Car) చేసిన ఓ ప్రమాదంలో ఓ బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లోని (Madhyapradesh) రాజ్‌గఢ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బైకర్‌ను ముందుగా రాజ్‌గఢ్‌లోని ఓ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజధాని భోఫాల్‌కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పురోహిత్ మాతృమూర్తి చనిపోతే గురువారం ఉదయం ఆమెకు నివాళులు అర్పించడానికి కొడాక్య గ్రామానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లారు. నివాళులు అర్పించి, ప్రకాశ్ పురోహిత్‌ను పరామర్శించిన అనంతరం ఆయన రాజ్‌గఢ్‌కు బయలుదేరారు.
Congress leader Digvijay Singh 's car hit a bike-borne man in MP's Rajgarh, Driver Akhtar Khan was arrested & car seized by police. pic.twitter.com/JTTmssDjB3
— Political Kida (@PoliticalKida) March 9, 2023
ఎలా జరిగిందంటే?
రాజ్‌గఢ్‌కు చేరుకోగానే ఆయన ఫార్చ్యూనర్ కారు టు వే రోడ్డుపై రోడ్డు క్రాస్ చేస్తూ ఎదురుగా వచ్చిన బైకర్ రాంబాబు (20) ను మితిమీరన వేగంతో ఢీకొట్టింది. డ్రైవర్ కారును అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు వీడియోలో అర్థం అవుతుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్ సింగ్ కారుదిగి బాధితుడి దగ్గరికి పరుగుతీసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.