Bengaluru, July 8: కర్ణాటక అసెంబ్లీలో (Karnataka Assembly) భద్రతా వైఫల్యం బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడొకరు ఎమ్మెల్యేలా (MLA) పోజిస్తూ దర్జాగా అసెంబ్లీలోకి వెళ్లి కూర్చున్నాడు. 15 నిమిషాలపాటు అతడిని ఎవరూ గుర్తించలేకపోయారు. చివరికి ఓ ఎమ్మెల్యే గుర్తించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ (Arrest) చేశారు. నిందితుడిని చిత్రదుర్గకు (Chitradurga) చెందిన తిప్పేరుద్రగా (Thipperudra) గుర్తించారు.
Police said the man from #Karnataka's Chitradurga district claimed that he entered the Vidhan Soudha without permission just because he wanted to attend the Budget session. (By @nagarjund)https://t.co/UQdOzDey7Y
— IndiaToday (@IndiaToday) July 7, 2023
అసలేం జరిగిందంటే?
సాగర్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణగా నటిస్తూ తిప్పేరుద్ర అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తొలుత అసెంబ్లీ హాళ్లలో తిరిగిన నిందితుడు ఆ తర్వాత అసెంబ్లీలోని దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ సీటులో కూర్చున్నాడు. అతడిని చూసి అనుమానించిన జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ మార్షల్స్ కు, స్పీకర్ కు సమాచారం అందించారు.
ఎలా లోపలి వచ్చాడంటే?
మార్షల్స్ వచ్చి ఆయనను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తాను ఎమ్మెల్యేనని, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని మొండిపట్టు పట్టాడు. అయితే, ఎమ్మెల్యే అని రుజువు చేసే ఎలాంటి ఆధారాలు ఆయన వద్ద లేకపోవడంతో ఆయనను అరెస్ట్ చేశారు. విజిటర్స్ పాస్ తో లోపలికి ప్రవేశించిన వృద్ధుడు తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనని చెప్పడంతో మార్షల్స్ కూడా నిజమేననుకుని లోపలికి విడిచిపెట్టారు. రుద్రప్పపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.