Nellore, July 8: నెల్లూరులో (Nellore) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering Student) జేబులోని (Pocket) సెల్ ఫోన్ (Mobile Phone) ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ నిన్న బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్కూటీపై బయలుదేరాడు.
మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, పేలిన ఫోన్ ఓ ప్రముఖ బ్రాండ్ కు చెందినదిగా సమాచారం.