Credits: Twitter

Patna, May 7: బీహార్ (Bihar) లోని సాసారామ్ పట్టణంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) గా మారింది. సిటీలోని ఓ మురుగునీటి కాలువలో (Drain) కరెన్సీ నోట్లు (Currency Notes) తేలుతూ కనిపించాయి. దీంతో వాటిని దక్కించుకోవడానికి జనం ఎగబడ్డారు. మురుగును, దుర్గంధాన్ని లెక్కచేయకుండా కాలువలోకి దిగి నోట్లు చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rains In Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ అవకాశం.. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన

నోట్లు నకిలీవా?

ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని కొంతమంది సందేహం వెలిబుచ్చారు. అయితే కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా ఓ రూమర్ కూడా అయి ఉండొచ్చని వివరించారు.

Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి