Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన

‘శాకుంతలం’ చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.

Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా..  గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
Shaakuntalam (Photo Credits: Twitter)

Hyderabad, September 30: సమంత (Samanta) కథానాయికగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ (Gunashekar) దర్శకత్వం వహిస్తున్నారు. శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ఇందులో చూపెట్టనున్నారు. దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ‘ఆదిపురుష్’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే??

తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు తెలిపారు. చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Sep 30, 2022 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).