Newdelhi, July 16: తన ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించిన వ్యక్తిని చూసిన ఓ కొంగ (Crane) ఆనందంతో గంతులేసింది. అతడిని చేరుకునేందుకు ఉబలాటపడింది. రెక్కలు (Wings) ఆడిస్తూ, ప్రేమగా అరుస్తూ నృత్యం చేసింది. నెటిజన్ల (Netizens) హృదయాలను కొల్లగొడుతున్న ఈ వీడియో (Video) ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన అరిఫ్‌ఖాన్ గుజ్రార్ (Arif Khan Gurjar) ఏడాది క్రితం తన పొలానికి వెళ్లగా అక్కడ తీవ్రంగా గాయపడి విలవిల్లాడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షి అయిన సారస్ కొంగ కనిపించింది. వెంటనే దానిని చేతుల్లోకి తీసుకున్న అరిఫ్ దాని ప్రాణాలు కాపాడాడు. చాలాకాలంపాటు దానిని సంరక్షించాడు. దీంతో ఆ కొంగ అతడిని విడిచి ఉండేది కాదు. అతడు ఎక్కడికి వెళ్లినా ఎగురుకుంటూ అతడితోపాటే వెళ్లేది.
A video of Uttar Pradesh farmer Mohammad Arif visiting the Sarus crane he had befriended after rescuing it a year ago is making waves on the internet. The bird can be seen jumping several times and almost trying to reach him.#ArifMohammed #crane #arifandsaras pic.twitter.com/URo7QbJZSR
— Tvbharat24 (@tvbharat24news) July 15, 2023
కొంగ స్వాధీనం
విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు కొంగను స్వాధీనం చేసుకుని బలవంతంగా కాన్పూరు జూకు తరలించారు. తాజాగా కొంగను చూసేందుకు అరిఫ్ జూకు వెళ్లాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించాడు. అతడిని చూసిన కొంగ వెంటనే గుర్తుపట్టేసింది. రెక్కలు ఊపుతూ, అరుస్తూ పట్టరాని సంతోషంతో అతడి వద్దకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని అరిఫ్ తన సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. మూగప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ఆ వీడియో మీరూ చూడండి.