Afghanistan: మళ్లీ మొదలైన తాలిబన్లు వికృత క్రీడ, క్రేన్లకు నాలుగు శవాలను వేలాడదీసి బహిరంగ ప్రదర్శన, తాలిబన్ల విచ్ఛేదనం, నేరస్తులను ఉరితీయడాన్ని ఖండించిన అమెరికా
A criminal being executed by the Taliban. (Photo Credit - Reuters)

Kabul, Sep 26: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు తమ పాత వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాట్ నగరం (Herat city,) ప్రధాన కూడలిలో శనివారం ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసి (Taliban hang dead body) బహిరంగంగా ప్రదర్శించారు. మరో మూడు మృతదేహాలను ఇతర కూడళ్లలో వేలాడ దీశారు.

తాలిబన్‌ ఫైటర్లు నాలుగు మృతదేహాలను హెరాట్‌ నగర ప్రధాన కూడలికి తీసుకువచ్చారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఒక మృతదేహాన్ని నగర ప్రధాన కూడలిలో క్రేన్‌కు వేలాడ దీయగా, మిగతా కూడళ్లలో బహిరంగంగా వేలాడ దీసేందుకు మూడు మృతదేహాలను తాలిబన్లు తరలించారని ప్రత్యక్షంగా చూసిన ఫార్మసీ యజమాని వజీర్ అహ్మద్ సిద్దిఖీ తెలిపినట్లు పేర్కొంది.

కాగా, కిడ్నాప్‌కు యత్నించిన నలుగురిని పోలీసులు పట్టుకుని చంపారని, ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసిన అనంతరం తాలిబన్‌ అధికారి ప్రకటించినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. మరోవైపు తమ మునుపటి పాలనలో మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్‌ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి ఇటీవల తెలిపాడు. గతంలో తాలిబన్‌ విధించిన దారుణ శిక్షల అమలుకు అతడు బాధ్యత వహించాడు.

మహిళలకు చోటిస్తే వ్యభిచారమే, వారు పిల్లల్ని కంటే చాలు, తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి సంచలన వ్యాఖ్యలు

తాలిబాన్లను విచ్ఛేదనం, నేరస్తులను ఉరితీయడాన్ని అమెరికా (US Condemns Taliban for Amputation) ఖండించింది. చట్టాలు మానవ హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, అవి ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కులను నిర్ధారించడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది. నేరస్తులను విచ్ఛేదనం చేయడం మరియు ఉరి తీయడం వంటి షరియా చట్టాలను అమలు చేయడంపై ఇటీవల తాలిబాన్ చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తీవ్రంగా స్పందించారు.

మేము తాలిబాన్ల ప్రకటనను మాత్రమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో వారి చర్యలను కూడా గమనిస్తున్నాము" అని ప్రైస్ చెప్పారు. ఆఫ్ఘన్ జర్నలిస్టులు, పౌర కార్యకర్తలు, మహిళలు, పిల్లలు, మానవ హక్కుల న్యాయవాదులు మరియు వికలాంగుల పక్కన యుఎస్ నిలుస్తుందని ప్రైస్ చెప్పారు మరియు వారి హక్కులను నిర్ధారించాలని తాలిబాన్లను కోరారు.

20 ఏళ్ళ తరువాత..ఆఫ్ఘ‌నిస్థాన్‌‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన అమెరికా బలగాలు, ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపిన తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి జ‌బిహుల్లా ముజాహిద్

తాలిబన్‌ ప్రభుత్వం నియమించిన హెరాత్‌ జిల్లా పోలీసు చీఫ్‌ జియావుల్‌హక్‌ జలాని మాట్లాడుతూ.. నలుగురు కిడ్నాపర్ల నుంచి తండ్రి, కుమారుడిని రక్షించి దుండగులను హతమార్చినట్లు వెల్లడించారు. కిడ్నాపర్లు జరిపిన కాల్పుల్లో ఓ తాలిబన్ ఫైటర్‌తోపాటు ఓ పౌరుడు గాయపడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఆ నలుగురిని హతమార్చామని వెల్లడించారు. అయితే ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది.

అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు ఈమధ్యే వెల్లడించారు.

తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మాట్లాడుతూ.. గతంలో తాము బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శించాయని, కానీ తామెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదన్నారు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదని, మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్‌ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు.

తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్‌‌లో మిన్నంటిన ఆకలి కేకలు, ప్రపంచ దేశాలు ఆర్థిక సాయం ఆపివేయడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశం, వీటికి తోడయిన కరోనా మహమ్మారి, వ్యవసాయ కరువు

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం మహిళల స్వేచ్ఛను హరించి వేసిన తాలిబన్లు.. వార్తా సంస్థలపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. మీడియా స్వేచ్ఛను అణచివేసేలా.. ‘11 నియమాలు’ పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. మతానికి విరుద్ధంగా, ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండేందుకు తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ప్రభుత్వ మీడియా కార్యాలయాల సమన్వయంతో జర్నలిస్టులు వార్తలు, ఫీచర్ కథనాలు రాయాలని తాలిబన్లు హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది.

తాలిబన్ల పాలన, వారి 11 నియమాలతో అఫ్గాన్‌లోని జర్నలిస్టులు భయపడిపోతున్నారని అమెరికాకు చెందిన పత్రికా స్వేచ్ఛ సంస్థ సీనియర్ సభ్యుడు స్టీవ్‌ బట్లర్‌ తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. తమకు సాయం చేయాలంటూ జర్నలిస్టుల నుంచి ఆ సంస్థకు వందల సంఖ్యలో ఈమెయిళ్లు వస్తున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం.. రోజువారీ వార్తలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న 150కి పైగా మీడియా సంస్థలు మూతపడినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పలు ప్రముఖ వార్తాపత్రికలు సైతం ముద్రణ కార్యకలాపాలను నిలిపివేసి, ఆన్‌లైన్‌ ఎడిషన్లు మాత్రమే ఇస్తున్నాయని పేర్కొంది.

తాలిబన్లు ఎంతటి క్రూరులంటే..మహిళలను చంపి ఆ శవంతో సెక్స్ చేస్తారు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను వారి సుఖం కోసం పంపాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన అఫ్గనిస్తాన్‌ మహిళ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా, మీడియా హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్ల మాటలు నీటి మూటలుగా మిగిలాయి. అనేక మంది విద్యార్థినులు తమ చదువులకు దూరమయ్యారు. ఎందరో మహిళలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కోల్పోయారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించలేదు. ఆడవాళ్లు ఉన్నత పదవులు చేపట్టేంత సమర్థులు కారని, వారు పిల్లల్ని కంటే సరిపోతుందని చులకన చేసి మాట్లాడారు. తమ స్వేచ్ఛను హరించివేయకూడదంటూ రోడ్లపైకి చేరి గళమెత్తిన మహిళపై దాడులు చేశారు. ఈ వార్తలను కవర్‌ చేసిన జర్నలిస్టుపైనా దాడులకు పాల్పడ్డారు. వారితో క్షమాపణలు చెప్పించుకొని, శిక్షలు వేసి వదిలిపెట్టారు.

ఇక ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు 90 మైళ్ల దూరంలోని నంగర్‌హార్ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌పై పట్టు కోసం తాలిబన్‌, ఐఎస్‌కేపీ మధ్య ఫైట్‌ జరుగుతున్నది. తాజాగా శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు గాయపడ్డారు. కాగా, చనిపోయిన వ్యక్తి తాలిబన్‌ సభ్యుడని స్థానిక మీడియా తెలిపింది. తాలిబన్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారు. అయితే ఇది తమ పనేనని ఎవరూ వెల్లడించలేదు. కాగా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కేపీ పనిగా అనుమానిస్తున్నారు.

తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌పై తన పట్టును నిలుపుకునేందుకు ఐఎస్‌కేపీ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడుతున్నది. గురువారం ఐఎస్‌కేపీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరు కారుపై జరిపిన కాల్పుల్లో నలుగురు తాలిబన్లు చనిపోయారు. మరణించిన వారి చేతులు కట్టేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు.