Representational Image (Photo Credits: Rawpixel)

Newdelhi, Nov 4: మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) హైకోర్టులో (Highcourt) ఓ ఆసక్తికరమైన పిటిషన్‌ దాఖలైంది. క్రిమినల్‌ కేసులో (Criminal Case) జైలుశిక్ష పడిన ఓ ఖైదీ భార్య ఈ పిటిషన్‌ వేసింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, అందుకోసం తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె తన పిటిషన్‌ లో అభ్యర్థించింది. కనీసం 15 నుంచి 20 రోజులపాటు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. పిల్లలను కనడం తన ప్రాథమిక హక్కు అని ఆమె పిటిషన్‌ లో పేర్కొంది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్ కు ఆల్ రౌండర్ దూరం .. ఆయన ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ.. ఐసీసీ అధికారిక ప్రకటన

ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు

కోర్టు ఏం చేసింది?

సదరు మహిళ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆమె భర్తను విడుదల చేస్తే పిటిషనర్‌ గర్భం దాల్చే అవకాశం ఉందా లేదా..? అని తెలుసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. సదరు పరీక్షల కోసం పిటిషనర్‌ ఈ నెల 7న జబల్‌పూర్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మెడికల్‌ కాలేజీలో పరీక్షల అనంతరం ఆమెకు తల్లి అయ్యే యోగ్యత ఉందని తేలితే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోర్టు భావిస్తోంది. కేసు తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 22కు వాయిదా వేసింది.