67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
గ్రామీ వేడుకలకు అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ (Kanye West) 2025లో బెస్ట్ ర్యాప్ సాంగ్‌కు నామినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఫంక్షన్‌కు తన భార్య, మోడల్ బియాంకా సెన్సోరీ (Bianca Censori)తో కలిసి వచ్చారు. అవార్డ్ ఫంక్షన్‌లోకి రాగానే రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వెళ్లారు. ఇంతలో బియాంకా ఉన్నట్టుంటి తన దుస్తులు తీసేసీ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నిర్వాహకులు వెంటనే ఆ జంటను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ఎందుకు అలా ప్రవర్తించిందనే దానిపై సమాచారం లేదు.
రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఒక్కసారిగా బట్టలు విప్పేసిన అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా
People are losing their minds over this, but I love it.
I can't watch a TV show these days without exploitative male nudity, so this is equality.#biancacensori #Grammys #KanyeWest pic.twitter.com/mElyyfoKjV
— Peter Lloyd (@Suffragent_) February 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)